గెలిస్తే పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం : రాహుల్ గాంధీ

సమస్తిపూర్ : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ రాష్ట్రం సమస్తిపూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలోని పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పారు. ఈ సభలో ఆర్జేడీ నాయకుడు తేజస్వియాదవ్ కూడా పాల్గొన్నారు.

“న్యాయ్ స్కీమ్ మా ఆయుధం. వచ్చే ఐదేళ్లలో పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన సర్జికల్ స్ట్రైక్ లాంటిది కాదిది. పేద ప్రజల సంక్షేమం కోసం రూపొందించిన గొప్ప పథకం ఇది. మోడీ ఐదేళ్ల హయాంలో… గబ్బర్ సింగ్ టాక్స్ , నోట్లరద్దు లాంటి నిర్ణయాలు తీసుకుని… పేద ప్రజలను దారుణంగా దెబ్బకొట్టారు” అన్నారు రాహుల్ గాంధీ.

“బిహార్ లో మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను, ఆయన కుటుంబాన్ని మోడీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. హాస్పిటల్ లో ఉన్నప్పుడు తండ్రిని చూసేందుకు కూడా తేజస్వి యాదవ్ ను అనుమతించలేదు. మోడీ ఏం చేశారో.. బిహార్ ప్రజలు మరిచిపోరు. ఆయన్ను ఎన్నిటికీ క్షమించరు” అన్నారు.

 

Latest Updates