ఎన్సీపీతో ‘చేతులు’ కలిపితే.. బీజేపీకి గడ్డు కాలమే

Will Congress Hits BJP In This Election..?

గాంధీనగర్‌ : గుజరాత్‌ .. ప్రధాని మోడీ సొంతరాష్ట్రం, ఆయన్ను నాలుగు సార్లు సీఎంను చేసిన రాష్ట్రం . ఆ చరిష్మాతోనే 2014 లోక్‌‌సభ ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలను బీజేపీ క్లీన్‌‌ స్వీప్‌ చేసింది.అయితే ఈ ఐదేళ్లలో పరిస్థితి తారుమారైనట్లు కనిపిస్తోంది. 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఫలితాలను చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. మూడు దశాబ్దాల తర్వాత గుజరాత్‌ లో కాంగ్రెస్‌‌ బాగా పుంజుకుంది. 2017 ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌‌ చాలా చోట్ల తక్కువ ఓట్ల తేడాతో ఒటమిని చవి చూసింది. బనస్‌‌కాంతా, పటాన్‌‌, మెహ్‌ సానా, సబర్‌ కాంతా, సురేం ద్రనగర్‌, జునాగఢ్‌, అమ్రేలీ, ఆనంద్‌ సెగ్మెంట్లలో బీజేపీ కంటే కాంగ్రెస్‌‌కే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. ఆ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకుంటూనే ఎన్‌‌సీపీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌‌కు గెలుపు అవకాశా లు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌‌సీపీ నేత కుటియానా అసెంబ్లీ స్థానాన్ని గెలిచారు. అదే సెగ్మెంట్‌‌లో కాంగ్రెస్‌‌ క్యాండెంట్‌‌కు దాదాపు 11,000 ఓట్లు తగ్గా యి. 2017లో కాంగ్రెస్‌‌ పార్టీకి వచ్చిన ఫలితాన్ని కంటిన్యూ చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని కాంగ్రెస్‌‌ సీనియర్‌ నేత, పార్టీ ట్రెజరర్‌ అహ్మద్‌ పటేల్‌‌ చెప్పారు.

ఇద్దరు సిట్టింగులకే సీట్లు

సౌరాష్ట్ర, నార్త్‌‌ గుజరాత్‌ లో బీజేపీ చాలా బలహీనపడింది. నార్త్‌‌ గుజరాత్‌ లోని ఎనిమిది స్థానాల్లో కేవలం ఇద్దరు సిట్టింగులకు మా త్రమే తిరిగి సీట్లు కేటాయించింది. సురేంద్ర నగర్‌ సిట్టింగ్‌‌ ఎంపీదేవ్‌‌జీని పక్కన పెట్టి కొత్త క్యాండెట్‌‌కు సీటును కేటాయించింది. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థుల కోసం వెతుకుతోంది.

‘మిషన్‌‌ కమలం’

గుజరాత్‌ లో ఎప్పటిలాగానే పార్టీ జెండా ఎగరేయాలనే వ్యూహంతో ఉన్న కాషాయ పార్టీ‘ మిషన్‌‌ కమలం’ ప్రారంభించింది. పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‌‌ పార్టీ నుంచి బలమైన నాయకులను తమ పార్టీలో చేర్చు కుని ముందుకు వెళ్లాలనే వ్యూహంతో  పనిచేస్తోంది. దీంట్లో భాగంగానే సీనియర్‌ కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే , గుజరాత్‌ అహిర్‌ సమాజ్‌‌ ప్రెసిడెంట్‌‌ జవహర్‌ చావాడ బీజేపీలోకి లాక్కున్నా రు. దీంతో సౌరాష్ట్ర  రీజియన్‌‌లోని నాలుగు లోక్‌‌సభ స్థానాల్లోని అహిర్‌ కమ్యూనిటీ వారంతా తమకు సపోర్ట్‌‌  చేస్తారని బీజేపీ భావిస్తోంది. కాంగ్రెస్‌‌ లీడర్‌ , ఓబీసీ వర్గంలో బలమైన లీడర్‌ కున్వరీ భవాలియా బీజేపీలో చేరగా.. చేరినకొన్ని గంటల్లోనే ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. మరో ముగ్గురు కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే లు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. ఇంకా చాలా మంది ఎమ్మెల్యే లు గోడ దూకెందుకు రెడీగా ఉన్నారని సమాచారం. నార్త్‌‌ గుజరాత్‌ లో నాలుగు సీట్లలో ఎక్కువగా ఉన్న ఠాకోర్‌ కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే ఓబీసీ నేత ఆల్పేస్‌‌ ఠాకోర్‌ ను బీజేపీలో చేరాలని ఆఫర్‌ చేసింది. కానీ ఆయనదాన్ని తిరస్కరించారు. కాంగ్రెస్‌‌లోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు.

మా పార్టీ ఎమ్మెల్యే లను బీజేపీలాక్కోవాలని చూస్తోంది. ఏదేమైనా లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ దూసుకెళ్తుంది.- అమిత్‌ చావడ

కాంగ్రెస్‌ స్టేట్‌ యూనిట్‌ చీఫ్ అసెంబ్లీ ఎన్నికలు వేరు.. లోక్‌‌సభఎన్నికలు వేరు. మోడీ చరిష్మా, కేంద్రప్రభుత్వం చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తాయి.- జితు వాఘాని, గుజరాత్‌ బీజేపీ ప్రెసిడెంట్‌

Latest Updates