రాహుల్ ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ చేస్తా: ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా… పుల్వామా దాడిలో మరణించిన ఓ అమర జవాన్ కుటుంబ సభ్యులని కేరళలో ఇవాళ కలిశారు. రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న వయనాడ్ నియోజకవర్గంలో ప్రియాంక ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వయనాడ్  నియోజకవర్గం మక్కంకున్నులో పర్యటించిన ఆమె.. పుల్వామా దాడిలో మరణించిన స్థానిక జవాన్ వి.వి. వసంత కుమార్ ఇంటికి వెళ్లారు. అమర జవాన్ కుటుంబ సభ్యులను పలకరించి, వారి మంచి చెడులు తెల్సుకున్నారు. వసంత్ కుమార్ మృతిపై వారికి  తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేరళలో పర్యటిస్తున్న ప్రియాంక గాంధీ.. కొద్దిసేపు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. వారణాసి నుంచి ప్రధాని మోడీపై కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తారా.? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తాను ఎక్కడ పోటీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని… ఒకవేళ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే తానూ సంతోషంగా వారణాసి నుంచి పోటీ చేస్తానని చెప్పారు ప్రియాంకగాంధీ.

 


Latest Updates