కశ్మీరీల వాయిస్ బ్రిటన్ లో వినిపిస్తా : బాక్సర్ ఆమిర్ ఖాన్

పాకిస్థాన్ కు చెందిన బ్రిటీష్ బాక్సర్ ఆమిర్ ఖాన్ ఆక్రమిత కశ్మీర్ లో పర్యటించాడు. స్థానిక ప్రజలతో మాట్లాడి… పరిస్థితులపై ఆరా తీశాడు. కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను భారత ప్రభుత్వం తొలగించి, జమ్ముకశ్మీర్ ను 2 యూటీలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్న 3 వారాల తర్వాత ఆమిర్ ఖాన్ ఎల్ఓసీలో పర్యటించాడు. ఇండియా తీసుకున్న చర్యలను ఆయన తప్పుపట్టాడు.

బాక్సర్ ఆమిర్ ఖాన్… కెరీర్ కోసం బ్రిటన్ లో సెటిలయ్యాడు. అక్కడే ట్రెయినింగ్ తీసుకుంటూ.. బ్రిటీష్ బాక్సర్ గా పోటీల్లో పాల్గొంటున్నాడు. కశ్మీరీల గొంతును, ఇక్కడున్న పరిస్థితులను బ్రిటన్ లో వినిపిస్తానని కశ్మీర్ పర్యటన సందర్భంగా చెప్పాడు.

2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో బ్రిటన్ తరఫున వెండిపతకం గెల్చుకున్నాడు ఆమీర్. ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్, భారత బాక్సర్ విజేందర్ సింగ్ ను తనతో పోటీకి రావాలని కవ్విస్తూ… తరచుగా వార్తల్లోకి వచ్చేవాడు ఆమిర్ ఖాన్. 65 కేజీల విభాగంలో ఆమిర్ పోటీ పడుతుండగా.. 75 కేజీల విభాగంలో విజేందర్ బౌట్ లోకి దిగుతుంటాడు. అందుకే.. బచ్చాగాళ్లతో ఆడటం మానుకో… అప్పుడు నీతో పోటీకి వస్తా అంటూ విజేందర్ …. ఆమిర్ కు డైలాగ్ పంచ్ లు ఇస్తుండేవాడు.

తాజాగా.. ఆమిర్ ఖాన్.. ఎల్ఓసీకి రావడంతో… పాక్ అధికారులు ఆయనకు గట్టి సెక్యూరిటీ కల్పించారు.