బెంగ‌ళూరు విధ్వంసం : న‌ష్ట ప‌రిహారాన్ని ముక్కుపిండి వ‌సూలు చేస్తాం

బెంగ‌ళూరులో హింసాకాండ కు పాల్ప‌డ్డ ఆందోళ‌న కారుల వ‌ద్ద నుంచి న‌ష్ట‌ప‌రిహారం ముక్కుపిండి వ‌సూలు చేస్తామ‌ని మంత్రి సీటీ ర‌వి హెచ్చ‌రించారు.

గ‌తేడాది పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయ‌ని, ఆ ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణ‌మైన ఆందోళ‌న కారుల వ‌ద్ద నుంచి ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం వ‌సూలు చేసింద‌ని, అదే త‌ర‌హాలో ఇక్క‌డ వ‌సూలు చేస్తామ‌ని అన్నారు.

చిచ్చుపెట్టిన ఫేస్ బుక్ పోస్ట్

సోష‌ల్ మీడియాలో ప్ర‌తీఒక్క‌రు అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రిస్తే భారీ ఆస్తిన‌ష్టం, ప్రాణ‌న‌ష్టం చ‌విచూడాల్సి వ‌స్తుంద‌నే ఉదంతానికి బెంగ‌ళూరు ఘ‌ట‌న నిలుస్తోంది.

బెంగ‌ళూరుకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి అల్లుడు ఓ మ‌తాన్ని విమ‌ర్శిస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. అంతే ఆ ఫోస్ట్ పై ఆ మతానికి చెందిన ఆందోళ‌న కారులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. దీంతో బెంగ‌ళూరులోని కేజి హ‌ల్లి, డీజీహ‌ల్లి ప్రాంతాలు యుద్ధ‌వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించాయి.

వివాదానికి కార‌ణ‌మైన ఎమ్మెల్యే శ్రీనివాస్ మూర్తి ఇంటిపై ఆందోళ‌న కారులు దాడి చేశారు. ప‌క్క‌నే ఉన్న పోలీస్ స్టేష‌న్ లో ఉన్న సుమారు 200ద్విచ‌క్ర‌వాహ‌నాల‌కు నిప్పు పెట్టారు. భ‌వ‌నాల్ని త‌గ‌ల‌బెట్టారు. 60మందికి పై పోలీసులు గాయ‌ప‌డ్డారు. దీంతో ఆందోళ‌న కారుల్ని నియంత్రించేందుకు పోలీసులు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మ‌ర‌ణించారు. లాండ్ అండ్ ఆర్డ‌ర్ ను త‌మ‌చేతిలోకి తీసుకున్న పోలీసులు ఘర్ష‌ణ పునరావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు.

కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్నారు

క‌ర్ణాట‌క మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధ‌రామ‌య్య బెంగ‌ళూరు అల్ల‌ర్ల‌పై స్పందించారు. హిందువులు – ముస్లీంలు మ‌త‌సామ‌ర‌స్యాన్ని కాపాడుతున్నారు. కానీ ఈ విధ్వాంసానికి కాంగ్రెసే కార‌ణ‌మంటూ ప్ర‌జ‌ల్ని న‌మ్మించే ప్ర‌యత్నం చేస్తున్నార‌ని అన్నారు.

అధికారం కోసం ప్ర‌జ‌ల్ని ఇబ్బంది పెట్టొద్దు

క‌ర్ణాట‌కకు చెందిన మ‌రో మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి మాట్లాడుతూ చ‌ట్టానికి మించింది ఏదీ లేద‌ని అన్నారు. ఈ సంఘ‌ట‌న ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో దాడి చేసిన‌ట్లు అనిపిస్తోంది. ఈ విష‌యంలో ప్ర‌జాప్ర‌తినిధులు ప‌క్ష‌పాతం చూప‌కుండా ప్ర‌జ‌ల్ని కాపాడాల‌ని కోరారు.

Latest Updates