గజ్వేల్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతా : కేసీఆర్

గజ్వేల్ ను అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు సీఎం కేసీఆర్.  సొంత నియోజయక వర్గం గజ్వేల్‌లో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మహతి ఆడిటోరియం ప్రారంభిచారు. ఒక రోజంతా నియోజకవర్గం ప్రజలతో ఉంటానన్నారు సీఎం కేసీఆర్. నియోజకవర్గంలోని అన్ని సమస్యలపై చర్చిద్ధామన్నారు.

అంతేకాదు గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీలు, పైరవీలు అనేది లేకుండా అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. గజ్వేల్ నుంచే హెల్త్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 7,500 ఎకరాల అటవీ భూమిని వనమూలికల పార్క్ గా అభివృద్ధి చేస్తామన్నారు. జనవరి చివరి నాటికి కాళేశ్వరం నీళ్లను జిల్లాకు తీసుకొస్తామన్నారు. ఇక్కడి నుంచే హైదరాబాద్ కు చేపల ఎగుమతి చేపడుతామన్నారు. ప్రజా రంగంలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా రిలాక్స్ కాకూడదన్నారు సీఎం కేసీఆర్.

Latest Updates