పెళ్లిగోల అనే టైటిల్ తో బ‌యోపిక్ తీస్తా: రేణు దేశాయ్

అందరూ తన పెళ్లి గురించే అడుగుతున్నారని  తెలిపారు రేణు దేశాయ్. తాను పెళ్లి చేసుకున్నా వారికి ఇబ్బందేనని… పెళ్లి చేసుకోకపోయినా ఇబ్బందేనంటూ సరదాగా స్పందించారు. తాజాగా ఇన్స్ట్రాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన ఆమెకు… ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆమెకు అవే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో  వీరి అనుమానాలకు సమాధానంగా ఒక బ‌యోపిక్ సినిమా తీస్తానని… దానికి ‘పెళ్లి గోల’ అనే టైటిల్ పెడతానని అన్నారు రేణు దేశాయ్.

పవన్ కల్యాణ్ కు దూరమైన తర్వాత రేణు దేశాయ్ తన కెరీర్ పై పూర్తిగా దృష్టి సారించారు. దర్శకురాలిగా, రచయితగా బిజీగా ఉన్నారు. మరోవైపు రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. తన రెండో పెళ్లి గురించి ఆమె ప్రకటించి రెండేళ్లు అయ్యింది. అయితే ఇంతవరకు పెళ్లికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియరాలేదు. దీంతో, పెళ్లి విషయం గురించి నెటిజెన్లు ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.

Latest Updates