మోడీజీ మరోమారు ‘నమస్తే ట్రంప్’ నిర్వహిస్తారా?

న్యూఢిల్లీ: అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌‌తో భారత ప్రధాని మోడీ ఫ్రెండ్‌‌షిప్‌‌పై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కామెంట్స్ చేశారు. కరోనా మరణాల విషయంలో ఇండియా సరైన లెక్కలు చెప్పట్లేదని ట్రంప్ చెప్పిన నేపథ్యంలో మరోమారు నమస్తే ట్రంప్ లాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారా అని చిదంబరం ప్రశ్నించారు. ‘కరోనా మరణాల విషయంలో లెక్కలు చూపించడం లేదని చెబుతూ ట్రంప్ చైనా, రష్యా సరసన భారత్‌‌ను చేర్చారు. ఈ మూడు దేశాలు తీవ్రస్థాయిలో వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. మరి ఈ నేపథ్యంలో తన స్నేహితుడు ట్రంప్‌‌ను గౌరవిస్తూ మోడీజీ మరోమారు నమస్తే ట్రంప్ ర్యాలీ నిర్వహిస్తారా?’ అని చిదంబరం పేర్కొన్నారు.

Latest Updates