జబర్దస్త్ క్రియేటివ్ హెడ్ గా నాగబాబు..?

will nagababu new look as a creative head for jabardasth show?

నటుడు, నిర్మాత నాగబాబు జబర్దస్త్ క్రియేటీవ్ హెడ్ అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ పరిచయం అక్కర్లేని పేరు. వారంలో రెండు రోజులు పాటు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయడంతో ఈ షోకి భారీగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ మాస్ మసాలా ఎంటర్ టైన్మెంట్ షో గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఈ  షో బుల్లితెరపై సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ లు పంచ్ లేస్తుంటే.. ఆ పంచ్ లకు నాగబాబు, రోజా మార్కులు వేస్తుంటారు. తెరపై వీళ్లకి ఎంత పాపులారిటీ వచ్చిందో… తెర వెనుక కీ రోల్ ప్లేచేసే క్రియేటివ్ హెడ్స్ నితిన్ – భరత్ లకు కూడా అంతే ఫేం ఉంది. ఇప్పుడు వీరిద్దరు ఆ షోనుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ షో నిర్మాతలకు, డైరక్టర్స్ కు మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో జబర్దస్త్ షో రేటింగ్ పై రకరకాల రూమర్లు వచ్చాయి. ఆ రూమర్లకు చెక్ పెడుతూ షో బాధ్యత నాగబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్నిసీరియల్స్ రాసిన అనుభవం ఉన్న నాగబాబు షో పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  అందుకే షోలో  కంటెస్ట్ చేసే కమెడీయన్లకు బరువు తగ్గాలని నాగబాబు ఆదేశాలిచ్చారట. కంటెంట్ ఉన్న డైరక్టర్లు షోనుంచి తప్పుకోవడంతో రేటింగ్ పడిపోకుండా జాగ్రత్త పడాలని చూస్తుందట జబర్దస్త్ టీం.

Latest Updates