ఎన్నికల్లో పోటీ చేయను.. ఏ పార్టీకి మద్దతివ్వను: రజినీ

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రాజకీయ కీలక ప్రకటన చేశారు. కొన్నాళ్ళ క్రితం తాను రాజ‌కీయాల‌లోకి అడుగుపెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన ఆయన..తాజాగా ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో తాను పోటీ చేయ‌న‌ని, ఏ పార్టీకి కూడా మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని ప్ర‌క‌టించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డ‌మే త‌మ ఉద్దేశ‌మ‌ని స్పష్టం చేశారు. ర‌జినీ త‌న పార్టీకి ‘రజినీకాంత్ మక్కల్ మంద్రమ్’ అనే పేరుని పెట్ట‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌తేడాది న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రాజ‌కీయాల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ర‌జినీకాంత్ 12 డిసెంబ‌ర్ 2018న త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పార్టీ పేరు ప్ర‌క‌టిస్తాడ‌ని అనుకున్న ఇప్పటి వ‌ర‌కు అది జ‌ర‌గ‌లేదు. ఇంకా పార్టీకి సంబంధించి ప‌నులు జ‌రుగుతున్నక్రమంలో పార్టీ పేరు ప్ర‌క‌టించ‌డంలో ఆలస్యం జ‌రుగుతోందంటున్నారు ఆయన సన్నిహితులు.

Latest Updates