బిల్లు కడితేనే డెడ్ బాడీ ఇస్తారా?

కరోనాతో ఆర్మీ మాజీ అధికారి ఒకరు మరణిస్తేబిల్ లు కడితేనే మృతదేహాం ఇస్తామని ఒక కార్పొరేట్‌ ఆస్పత్రి మొండికేయడంపై హైకోర్టు మండిపడింది. వెంటనే ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని అతని కుమారుడికి అప్పగించేలా డీఎంఅండ్‌హెచ్‌వో చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆస్పత్రి యాజమాన్యం కరోనా ట్రీట్ మెంట్ కు ఎక్కువ బిల్లులు వసూలు చేయడంపై కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్నిసుమోటోగా ప్రతివాదిగా చేసిన హైకోర్టు విచారణను సెప్టెంబర్‌ 11కి వాయిదా వేసింది.

రూ.8 లక్షలు కట్ట మన్నరు..

ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అయిన శ్రీరామ్‌ కుమార్‌ శర్మకు కరోనా వైరస్‌ సోకడంతో గత నెల 24న సన్‌ షైన్‌ ఆస్పత్రిలో చేశారు. ఈ నెల 2న సాయంత్రం మరణించారు. హాస్పిటల్ కు ఆయన బంధువులు రూ.4 లక్షలు చెల్లించా రు. అయితే ఆసుపత్రి అధికారులు రూ.8,68,832 బిల్లులు చెల్లించాలని పట్టుబట్టారు. మొత్తం బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామన్నారు. దీనిపై అడ్వకేట్లు ప్రతాప్‌ నారాయణ్‌ సంఘి, అవదేశ్‌ నారాయణ్‌ సంఘి, అనుషా సంఘి, హిమాంగిని సంఘీ హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారణ జరిపిన న్యాయమూర్తి తక్షణమే మృతదేహాన్ని కుమారుడు నవీన్‌ కుమార్‌ శర్మకు అప్పగించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Updates