డబుల్ ఇల్లు కలేనా!

  • టార్గెట్ లక్ష ఇండ్లు..దరఖాస్తులు ఐదున్నర లక్షల పైనే

ఏళ్లుగా కిరాయి ఇంటిలో ఉంటూ కుటుంబాన్నినెట్టు కొస్తున్న వారికి సొంత ఇల్లు చిరకాల కోరిక.అలాంటి వారి కలను సాకారం చేసేందుకు సర్కారు ప్రతిష్ఠాత్మక్మంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మొదలుపెట్టింది. దీంతో ఇల్లు లేని వారిలో ఆశలు చిగురిం చాయి. కానీ మహానగర పరిధిలో కడుతున్న ఇళ్లేమో లక్ష మాత్రమే. ఇల్లు కోసం అప్లై చేసుకున్నోళ్లేమో దాదాపు ఐదున్నర లక్షలకుపైగా ఉన్నారు. కడుతున్న ‘డబుల్’ఇళ్లలో తమకు ఇళ్లు దక్కుతాయో, లేదో అనే ఆందోళన వారిలో మొదలైంది.గ్రేటర్ పరిధిలో 97,915 డబుల్‌‌బెడ్‌‌ రూమ్‌‌ ఇళ్ల నిర్మా ణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 108 సైట్లలో రూ.8,59,858 కోట్ల అంచనాతో వాటిని నిర్మి స్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆరు సైట్లలో 615 ఇండ్లు పూర్తయ్యాయి. అందులో సికిం ద్రాబాద్ ఐడీహెచ్ కాలనీ, నాచారంలో 572 ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ ఏడాది డిసెంబర్ నా టికి మిగిలిన ఇళ్లను పూర్తిచేయాలని జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోంది. 36 వేల ఇళ్లు తుదిదశలో ఉన్నాయి. అలాగే ఈ ఏడాది మే, జూన్ నా టికి మిగిలిన ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంది. మొన్నటిదాకా ఎన్నికల హడావుడి, నిధుల కొరతతో ఇండ్ల నిర్మా ణం నత్తనడకన సాగాయి. ప్రస్తుతం ఇండ్ల నిర్మా ణం జరుగుతున్న ప్రదేశాలను ఖాళీ చేసిన వారు సొంతింటి కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సొంతిం టి కోసం ఎదురుచూస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.

ఇల్లు దక్కేనా?….

ఇళ్ల కోసం ముప్పతిప్పలు పడి దరఖాస్తు ఫాం నింపిన పలువురు జీహెచ్ఎంసీ, కలెక్టరేట్ లో అందజేశారు. ఇల్లు వస్తుం దన్న ఆశతో ఉన్నవారికి నిర్మా ణంలో ఉన్న ఇండ్ల విషయం తెలిసి ‘డబుల్‌‌’ కల.. కలగానే మిగిలిపోతుం దనన్న భావనలో ఉన్నారు. ఇలా మహానగరంలో సుమారుగా ఐదున్నర లక్షలకు పైగా డబుల్‌‌బెడ్‌‌ రూం ఇళ్లు వస్తాయని నేటికీ ఆశతో ఉన్నారు. ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎవరిని కలిస్తే ఇల్లు మంజూరు అవుతుం దని వెతుకులాడారు. కొందరు బస్తీలు, కాలనీల్లో చోటమోటా లీడర్ల చుట్టూ తిరిగితే, మరికొందరు పేరున్ననేతలను కలిసి ఇల్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.ఒకదశలో హైదరాబాద్ కలెక్టరేట్ ఇండ్ల దరఖాస్తుదారులతో పోటెత్తిం ది. అత్యధికంగా ముస్లిం కుటుంబాల నుంచే ఎక్కువ శాతం దరఖాస్తులు అందాయని కలెక్టరేట్‌‌ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు అందిన దరఖాస్తులు సుమారు ఐదున్నర లక్షలకు పైగా ఉన్నాయని తెలిపాయి.

Latest Updates