ఈసారైనా రాయల్స్‌ రాత మారేనా?

ఇప్పటికీ ఫారిన్ ప్లేయర్లపైనే భారం
ఇండియన్‌‌ యంగ్‌ స్టర్స్‌ కు మంచి చాన్స్‌

2008 అరంగేట్రం ఐపీఎల్‌‌లో రాజస్తాన్‌‌ రాయల్స్‌‌ టీమ్‌‌ చాంపియన్‌‌..! ఏమాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగినా.. క్రికెట్‌‌ బ్యాడ్‌‌బాయ్‌‌ షేన్‌‌ వార్న్‌‌ అద్భుతాలు చేయడంతో.. టైటిల్‌‌ను ఎగరేసుకుపోయింది..! ఇక ఆనాటి నుంచి నేటి వరకు లీగ్‌‌లో అనామక జట్టుగానే కొనసాగుతున్నది..! సీజన్లు గడుస్తున్నా.. ప్లేయర్లు మారుతున్నా.. రాయల్స్‌‌ ఆటలో మాత్రం మార్పు రావడం లేదు..! గతాన్ని పక్కనబెడితే.. ఈసారి విదేశీ టాప్‌‌ ప్లేయర్లతో పాటు ఇండియన్‌‌ యంగ్‌‌స్టర్స్‌‌ అండతో బరిలోకి దిగుతున్న రాయల్స్‌‌ జర్నీ.. లీగ్‌‌లో ఎంతవరకు సాగుతుంది..? ఈసారైనా తమ రాత మార్చుకుని టైటిల్‌‌ వేటలో సఫలమవుతుందా..?

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌: కాంబినేషన్స్‌‌ కరెక్ట్‌‌గా కుదిరినా.. ముందుండి నడిపించేవారున్నా… ఆరంభశూరత్వం తప్ప.. ఐపీఎల్‌‌లో రాజస్తాన్‌‌ ఇప్పటివరకు సాధించిందేమీ లేదు. ఏళ్లు గడుస్తున్నా పెర్ఫామెన్స్‌‌ పరంగా, రిజల్ట్‌‌ పరంగా ఎప్పుడూ వెనుకంజే. అయితే ఈసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌‌ స్టీవ్‌‌ స్మిత్‌‌ సారథ్యంలో రాజస్తాన్‌‌.. టైటిల్​ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. గత సీజన్లలో బ్యాట్స్‌‌మన్‌‌గా సక్సెస్‌‌ అయిన తమ రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌ అజింక్య రహానెను పక్కనబెట్టి ఈసారి స్మిత్‌‌కు పగ్గాలు అప్పగించారు. ప్రతి ఏడాది ఏదో ఓ కొత్త మార్పుతో బరిలోకి దిగుతున్నా.. కీలక టైమ్‌‌లో నిలకడలేమితో టీమ్‌‌ బాగా ఇబ్బందిపడుతోంది. ఈ నేపథ్యంలో మూడుసార్లు ప్లే ఆఫ్‌‌కు చేరుకున్నా.. రాయల్స్‌‌ను ఇప్పటికీ బలమైన ప్రత్యర్థిగా భావించరంటే అతిశయోక్తి కాదు. అప్పటివరకు బాగానే ఆడినట్లు కనిపించినా.. టపటపా వికెట్లు కోల్పోవడం, ఒత్తిడిని జయించలేకపోవడం రాయల్స్‌‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. ఈనెల 22న చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌తో జరిగే తొలి మ్యాచ్‌‌తో రాయల్స్‌‌ జర్నీ మొదలుపెట్టనుంది.

బలం.. బలగం

తమ పేరు చెబితేనే ప్రత్యర్థులు భయపడే బ్యాట్స్‌‌మెన్‌‌గానీ, బౌలర్లుగానీ రాయల్స్‌‌లో లేరు. కానీ టీ20 ఫార్మాట్‌‌కు సరిపోయే కాంబినేషన్స్‌‌ అన్నీ టీమ్‌‌లో ఉన్నాయి. వీళ్లు ప్లాన్‌‌ ప్రకారం ఆడితే టీమ్‌‌కు ఎదురులేనట్లే. బట్లర్‌‌, స్మిత్‌‌, మిల్లర్‌‌లాంటి విదేశీ క్రికెటర్లపైనే బ్యాటింగ్‌‌ బలం ఆధారపడి ఉంది. ప్రస్తుతం బట్లర్‌‌ ఫామ్‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. స్మిత్‌‌, మిల్లర్‌‌ కుదురుకుంటే రన్స్‌‌ వరదలాగా పారుతాయి. ఇంగ్లండ్‌‌కు తొలి వరల్డ్‌‌కప్‌‌ను అందించిన ఆల్‌‌రౌండర్‌‌ బెన్‌‌ స్టోక్స్‌‌.. టీమ్‌‌కు కొండంత అండ. ఇండియన్స్‌‌ పరంగా చూస్తే యశస్వి జైస్వాల్‌‌, రియాన్‌‌ పరాగ్‌‌, కార్తీక్‌‌ త్యాగీ అవకాశాలను వినియోగించుకుంటే స్టార్లుగా ఎదుగుతారు. టీమిండియాకు ఆడిన సంజూ శాంసన్‌‌, రాబిన్‌‌ ఊతప్పతో మనన్​ వోహ్రా.. బ్యాటింగ్ లైనప్‌‌లో కీలకం. వీరిలో ఒకరు బట్లర్‌‌తో కలిసి ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించే చాన్స్‌‌ ఉంది. బౌలింగ్‌‌లో ఆర్చర్‌‌, జైదేవ్‌‌ ఉనాద్కట్‌‌, వరుణ్‌‌ ఆరోన్‌‌, టై, కరన్‌‌తో పేస్‌‌ బలగం బలంగా ఉంది. శ్రేయస్‌‌ గోపాల్‌‌, రాహుల్‌‌ తెవాటియా స్పిన్‌‌ మ్యాజిక్‌‌ పని చేస్తే తిరుగుండదు. మిస్టరీ స్పిన్నర్‌‌ మయాంక్‌‌ మార్కండే అదనపు బలం.

బలహీనత..

కరోనా నేపథ్యంలో ఫారిన్‌‌ క్రికెటర్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. కెప్టెన్‌‌ స్మిత్‌‌ సహా కొందరు  ప్లేయర్లు  ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌‌లకు అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో కెప్టెన్సీ ఎవరు చేపడతారో క్లారిటీ లేదు. ఊతప్ప, ఉనాద్కట్‌‌లో ఒకరికి బాధ్యతలు ఇచ్చే చాన్స్‌‌ ఉంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌‌ వల్ల స్టోక్స్‌‌.. న్యూజిలాండ్‌‌లో ఉన్నాడు. అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియదు. ఒకవేళ స్టోక్స్‌‌ వస్తే మిడిలార్డర్‌‌ దుర్బేధ్యంగా మారుతుంది. ఆర్చర్‌‌లో నిలకడ ఉన్నా.. అతనికి సాయం అందించే ఉనాద్కట్‌‌, వరుణ్‌‌లో ఇది కొరవడింది. ఏ రోజు వాళ్ల పెర్ఫామెన్స్‌‌ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఈ సమస్యలను అధిగమిస్తేనే.. రాయల్స్‌‌కు ప్లే ఆఫ్‌‌ చాన్సెస్‌‌.

రాజస్తాన్​ రాయల్స్​ టీమ్​

బ్యాట్స్‌‌మెన్:  స్టీవ్​ స్మిత్​(కెప్టెన్​), రియాన్‌‌ పరాగ్‌‌, మనన్​ వోహ్రా, యశశ్వి జైస్వాల్, డేవిడ్​ మిల్లర్,

ఆల్‌‌రౌండర్స్‌‌: బెన్‌‌ స్టోక్స్‌‌, మహిపాల్‌‌ లోమ్రోర్‌‌, శశాంక్‌‌ సింగ్‌‌, అనిరుద్ధ జోషి

వికెట్‌‌ కీపర్స్‌‌: జోస్​ బట్లర్​, సంజు శాంసన్​, రాబిన్ ఉతప్ప, అనుజ్​ రావత్​

బౌలర్స్‌‌: ఆర్చర్​, జైదేవ్​​ , శ్రేయస్​ గోపాల్​, వరుణ్​ ఆరోన్​, అంకిత్​ రాజ్​పుత్​, రాహుల్ తెవాటియా, ఒషేన్​ థామస్​, కార్తీక్​ త్యాగీ, ఆకాశ్​ సింగ్​, ఆండ్రూ టై, టామ్​ కరన్​. మయాంక్​ మార్కండే.

For More News..

కార్ల సేల్స్​లో రెండంకెల గ్రోత్

రాష్ట్రంలో భారీగా పెరిగిన టూ వీలర్‌ సేల్స్‌

Latest Updates