విలియమ్సన్ కే రైజర్స్ పగ్గాలు

ఆస్ట్రేలియా స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్‌ వార్నర్‌ గైర్హా జరీలో గతేడాది సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌ టీమ్‌ను కెప్టెన్‌ గా విజయవంతంగా నడిపించిన కేన్‌ విలియమ్సన్‌ ఈ సీజన్‌ లో కూడా నాయకుడిగా కొనసాగనున్నాడు. రెండేళ్ల కిందట నాయకుడిగా తమకు ట్రోఫీ అందిం చిన వార్నర్‌ జట్టులో రీ ఎంట్రీ ఇచ్చినా .. విలియమ్సనే కెప్టె న్‌ గా వ్యవహరిస్తాడని సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌కోచ్‌ టామ్‌ మూడీ స్పష్టం చేశాడు. స్టార్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ వైస్‌ కెప్టె న్సీ బాధ్యత చేపట్టనున్నాడు. బాల్‌ టాం పరిం గ్‌ వ్యవహారంలో నిషేధం ముగిసిన తర్వాత వార్నర్‌ చేరికతో జట్టుకు కొం డంత బలం వచ్చిందని అన్నాడు. అదే సమయంలో కేన్‌ అద్భుతమైన ఆటగాడని కొనియాడాడు. గత సీజన్‌ లో అతను జట్టును నడిపిం చిన విధానం ఆకట్టుకున్నదని చెప్పా డు. వార్నర్‌ లేకపోవడం, పలువురు క్రికెటర్లు గాయాలతో టీమ్‌ ఇబ్బం దిపడ్డ దని చెప్పాడు.అలాం టి పరిస్థితుల్లో నూ విలియమ్సన్‌ టీమ్‌ ను ఫైనల్‌ కు తీసుకెళ్లా డన్నాడు. ఈ ఏడాది కొత్తగా వచ్చి న కొత్త ప్లేయర్లు జానీ బెయిర్‌ స్టో, మార్టిన్‌ గప్టిల్‌ , విజయ్‌ శంకర్‌ , అభిషేక్‌ శర్మ, షాబాజ్‌ నదీమ్‌ ఈ సీజన్‌ వేలంలో కొం దరు కొత్త ఆటగాళ్ల చేరికతో టీమ్‌ అన్ని విభాగాల్లో సమతూకంలో కని పిస్తోందన్నాడు. కాగా, భుజం గాయం నుం చి కోలుకుంటున్న కేన్‌ విలియమ్సన్‌ తో పాటు న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ శుక్రవారం సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌తో కలవనున్నారు.

Latest Updates