మందు బాబులు అలర్ట్.. వైన్స్ షాపులు బంద్

  • 29 నుంచి డిసెంబర్‌‌‌‌ 1 వరకు వైన్స్​ షాపులు బంద్‌‌
  • స్టేట్​ ఎలక్షన్‌‌ కమిషనర్‌‌‌‌ పార్థసారథి

హైదరాబాద్‌‌, వెలుగు: జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఈనెల 29 సాయంత్రం నుంచి డిసెంబర్‌‌‌‌ 1 వరకు వైన్స్​ షాపులు మూసివేయాలని స్టేట్‌‌ ఎలక్షన్‌‌ కమిషనర్‌‌‌‌ సి.పార్థసారథి ఆదేశించారు. డిసెంబర్‌‌‌‌ 4న కౌంటింగ్‌‌ ఉన్నందున ఆరోజు కూడా మద్యం షాపులు తెరవకూడదని చెప్పారు. మద్యం అక్రమ రవాణా చేయకుండా చెక్‌‌ పోస్టులు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌‌ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారు. ఎస్‌‌ఈసీ ఆఫీసులో ఎక్సైజ్‌‌ కమిషనర్‌‌‌‌ సర్ఫరాజ్‌‌ అహ్మద్‌‌, ఇతర అధికారులతో పార్థసారథి సమావేశం బుధవారం నిర్వహించారు. పోయిన ఏడాది మద్యం ఉత్పత్తులు, అమ్మకాలు.. ప్రస్తుత అమ్మకాలను  కంపేర్‌‌‌‌ చేయాలని సూచించారు. నల్లబెల్లం, మద్యం తయారీ ముడిసరుకులను సీజ్‌‌ చేయాలని చెప్పారు.

More News

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి

Latest Updates