నేను ఇంటికి వెళ్లను..ఆర్మీ క్యాంపుకు వెళ్తా: అభినందన్

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.  పాకిస్థాన్ లో యుద్ద విమానం పేల్చి అక్కడ బందీగా చిక్కి గాయాలతో భారత్ కు తిరిగి వచ్చి దేశ వ్యాప్తంగా మారుమోగిపోయాడు.  గాయాలైన కారణంగా అభినందన్ ను డాక్టర్లు టెస్టులు చేసి ఓ నాలుగు వారాల పాటు విలేజ్ కు వెళ్లి రెస్ట్ తీసుకోవాలని సూచించారు. అయితే అభినందన్ మాత్రం తమిళనాడులోని తన ఇంటికి వెళ్లకుండా  శ్రీనగర్ లోని వాయుసేన క్యాంపుకు వెళ్లి రెస్ట్ తీసుకోవాలని నిర్ణయంచుకున్నాడు. నాలుగు వారాల తర్వాత అభినందన్ కు మరోసారి వైద్య పరీక్షలు చేస్తారు.  టెస్టుల్లో అభినందన్ హెల్త్ సరిగా ఉన్నదని తేలితేనే యుద్ద విమానాలను నడపడానికి అనుమతి  ఇస్తారు.

Latest Updates