సహచరుల గ్రాండ్ వెల్ కమ్: విధుల్లో చేరిన అభినందన్

వింగ్ కమాండర్ అభినందన్ రెండు నెలల గ్యాప్ తరువాత విధుల్లో చేరారు. కశ్మీర్ లోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ కు వెళ్లిన అభినందన్ కు.. తోటి ఆఫీసర్ లు  గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అభినందన్ కూడా కాసేపు తన సహోద్యోగులతో సరదాగా గడిపారు. అక్కడున్నవాళ్లంతా.. ఆయనతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తి చూపారు. భారత్ మాతాకీ జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు.

బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత.. ఫిబ్రవరి 27న పాకిస్థాన్ కు చెందిన మిగ్-21 యుద్ధ విమానాన్ని వింగ్ కమాండర్ అభినందన్ నేలకూల్చారు. తర్వాత తన ఎఫ్-16 ఫైటర్ జెట్  కూలిపోవడానికి ముందు పారాచ్యూట్  సాయంతో.. ఆయన పాకిస్థాన్ భూభాగంలో దిగారు. తర్వాత అభినందన్ ను అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ.. ఎటువంటి షరతులు లేకుండా.. 48 గంటల్లో తిరిగి భారత్ కు అప్పగించింది.