వరల్డ్ కప్ విన్నర్ కు కల్లు చెదిరే ప్రైజ్ మనీ

మరో రెండు వారాల్లో ఐసీసీ వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ సారి ఎప్పుడూ లేనంతగా వరల్డ్ కప్ ప్రైజ్ మనీని ప్రకటించింది ఐసీసీ. ఫైనల్ లో విన్ అయిన టీంకు నాలుగు మిలియన్ డాలర్లు అంటే 28 కోట్లకు పైగా అందుతుంది. అలాగే రన్నరప్ కు రెండు మిలియన్ డాలర్లు అంటే 14 కోట్లకు పైగా వస్తుంది. ఇక సెమీఫైనల్ వరకు వెళ్లిన మిగత రెండు టీంలకు చెరో 8 లక్షల డాలర్లు అంటే కోట్లకు పైగా ప్రైజ్ మనీ దక్కుతుంది. లీగ్ దశలో  విన్ అయిన ప్రతీ మ్యాచ్ కు 40 వేల డాలర్లు. లీగ్ దశలోనే ఇంటి బాట బట్టిన టీంకు లక్ష డాలర్లు ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. మే 30 న స్టార్ట్ కానున్న ఈ వరల్డ్ కప్ జులై 14 వరకు జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ గ్రౌండ్ లో జులై 14 న జరుగుతుంది.

Latest Updates