రాత్రి చలి…పగలు వేడి

రాష్ట్రంలో ఓ వైపు చలి, మరోవైపు ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. రాత్రి, ఉదయం వేళల్లో చలి తీవ్రంగా ఉంటుండ గా మధ్యాహ్నం ఎండలు మంట పుట్టిస్తున్నాయి.వారం రోజుల్లో చలి ప్రభావం పూర్తిగా తగ్గి.. ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలో చాలా చోట్ల ఇప్పటికే 28నుంచి 30డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా కొన్ని జిల్లాల్లో 37 డిగ్రీల వరకు రికార్డవుతున్నాయి. బుధవారం మెదక్‌‌‌‌‌‌‌లో అత్యధికంగా 36.6 డిగ్రీలు నమోదైంది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ నెలలోనే ఎండవేడి ప్రభావం ఎక్కువగా ఉంటోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం

తెలిపారు. కిందటేడాదితో పోల్చుకుంటే ఫిబ్రవరి ఉష్ణోగ్రతలు రెం డుమూడు డిగ్రీలు ఎక్కువగా నమోదైనట్లు వివరించారు. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌, మే నెలల్లో41 నుంచి 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగత్రలు రికార్డుకావ్వొ చ్చని తెలిపారు.

Latest Updates