మళ్లీ విప్రో షేర్ల బైబ్యాక్..రూ.2483 కోట్ల లాభం

న్యూఢిల్లీ: మనదేశంలో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీవిప్రో మరోసారి షేర్ల బైబ్యాక్ రెడీ అయింది.రూ.325 చొప్పున రూ.10,500 కోట్ల విలువైన 32.3కోట్ల షేర్లను టెండర్ ఆఫర్‌ ద్వారా బైబ్యాక్‌ చేయాలన్న ప్రతిపాదనను కంపెనీ బోర్డు ఆమోదించింది. మొత్తం పేడప్‌ క్యాపిటల్ లో ఇది 5.35 శాతం. విప్రో ఇలాషేర్లను తిరిగి కొనడం ఇది మూడోసారి. 2016లోరూ.2,500 కోట్లు, 2017లో రూ.11 వేల కోట్లవిలువైన షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఈ ఏడాది మార్చి31 నాటికి విప్రోలో ప్రమోటర్లకు 73.85 శాతం,ఇండియన్ ఫైనాన్షియల్‌ ఇన్ట్యూషన్స్ 6.49శాతం, బ్యాంకు లు, మ్యాచువల్‌ ఫండ్స్‌, ఫారిన్‌ కంపెనీలకు 11.74 శాతం, సాధారణ ప్రజలు, కార్పొరేట్లకు 7.92 శాతం వాటాలు ఉన్నాయి . తాజా బైబ్యాక్‌ ప్రతిపాదనను వాటాదారులు ఆమోదించాలి.ఇందుకోసం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ప్రత్యేక తీర్మానంచేస్తారు . దీనిని నిర్వహించే తేదీ గురించి త్వరలోసమాచారం ఇస్తామని కంపెనీ తెలిపింది. ఇదిలా ఉంటే విప్రో ప్రత్యర్థి, ఇండియాలోనే నెం.1 ఐటీకంపెనీ టీసీఎస్‌ ఇటీవల రెండుసార్లు బైబ్యాక్‌ కార్యక్రమం ద్వారా రూ.16 వేల కోట్ల విలువైన షేర్లు కొన్నది.ఇన్ఫోసిస్‌ 2017లో రూ.13 వేల కోట్ల విలువైన,2018లో రూ.82,60 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ పద్ధతిలో కొన్నాయి .

క్యూ4లో లాభం 38 శాతం పెరుగుదల

2019 మార్చి 31తో ముగిసిన నాలుగో క్వార్టర్ లోవిప్రో రూ.2,845 కోట్ల లాభం సంపాదించింది.2018 క్యూ4తో పోలిస్తే ఇది 38 శాతం ఎక్కువ.ఈసారి ఇది రూ.2,490 కోట్ల లాభం ఆర్జిస్తుం దన్న విశ్లేషకుల అంచనాలను అందుకుంది. గత ఏడాది నాలుగో క్వార్టర్ లో ఈక్విటీ హోల్డర్ల లాభంరూ.1,803 కోట్లుగా నమోదయింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన చూస్తే క్యూ4లో రాబడి 8.98 శాతంపెరిగి రూ.15,006 కోట్లకు చేరింది. గత ఏడాది క్యూ4లో ఇది రూ.13,768 కోట్లుగా ఉంది. ఇకసంస్థ ఈబీఐటీ మార్జిన్లు క్యూ4లో 19.2 శాతం నమోదయ్యాయి.‘మా టీమ్స్‌ మా వ్యూహాలను అద్భుతంగా అమలు చేయడం వల్లే భారీ లాభాలు వచ్చాయి .పటిష్టమైన ఆర్డర్‌ బుక్‌, డిజిట్‌, సైబర్‌ సెక్యూరిటీ,ఇంజనీరిం గ్‌ సర్వీసెస్‌, క్లౌడ్ లో భారీ పెట్టుబడుల వల్లసంస్థకు పటిష్టమైన పునాదులు పడ్డాయి ’అని విప్రో సీఈవోఅబిదాలి నీముచ్ అన్నారు.

 

Latest Updates