టాక్సీలకు వైర్ లెస్ చార్జింగ్

బ్యాటరీ వాహనాలు వాడే వినియోగదారులకు శుభవార్త. త్వరలో వైర్ లెస్ చార్జీంగ్ సెంటర్లు…. వాహనం నేలపై నిలబడితే చాలు 75 కిలోవాట్ల వరకు చార్జీంగ్ చేసుకునే సదుపాయం….ఇందుకోసం నార్వే రాజధాని ఓస్లోలో ప్రయోగాలు చేపట్టింది.
ప్రపంచంలో పేట్రోల్ ,డిజిల్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు బ్యాటరీ వాహనాల తయారీ ఊపందుకుంది.ఇందుకోసం భారత్ కూడ ఇటీవల 10 వేల కోట్ల రుపాయల సబ్సిడిని విద్యుత్ వాహనాలకు కేటాయించింది..ఈనేపథ్యంలోనే చాల దేశాలు విద్యుత్ వాహానాల తయారికి చర్యలు చేపట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా బ్యాటరీతో నడిచే విద్యుత్ వాహనాలు పెద్ద ఎత్తున మార్కేట్లోకి రాబోతున్నాయి. ప్రధానంగా విద్యుత్ వాహనాలను బ్యాటరీ సమస్య వెంటాడుతుంది. చార్జీంగ్ చేసుకునేందుకు సరైన సదుపాయాలు లేక వాటి వినియోగంపై పెద్దగా అసక్తి చూపించడంలేదు. విద్యుత్ వాహనాల వినియోగం పెంపుదల కోసం బ్యాటరీ సెంటర్లను కూడ ఏర్పాటు చేస్తున్నారు. రాబోయో రోజుల్లో బ్యాటరీ వాహనాలకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

సాధారణంగా బ్యాటరీలు చార్జీంగ్ కావాలంటే చాల సమయం పడుతోంది. మరోవైపు అవి చార్జీంగ్ చేసుకోవడానికి స్వంత వనరులు తప్ప ప్రయాణంలో చార్జీంగ్ చేయించుకునేందుకు సరైన వనరులు ఉండవు. ఒకవేళ ఉన్నా అక్కడ చాలా సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ పరిస్థితి నుండి బయటపడేందుకు నార్వే రాజదాని ఓస్లాలో తొలిసారిగా వైర్‌లెస్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఇండక్షన్ టెక్నాలజీతో వీటిని సిద్దం చేశాయి. ఇందుకోసం హరిత ఇంధన కంపనీ ఫోర్టమ్, ఆమేరికాకు చెందిన మొమెంటమ్ డైనమిక్స్ ఒక ప్రాజెక్టును చేపట్టాయి. ఈ విధానంలో చార్జీంగ్ ప్లేట్లను నేలలో ఏర్పాటు చేస్తారు. దానిపైన వాహానాన్ని నిలిపి ఉంచాలి ,అందులో రిసీవర్ పెడతారు. దీంతో 75 కిలోవాట్ల వరకు చార్జీంగ్ చేసుకోవచ్చు.

Latest Updates