బాలుడి కడుపులో వైర్‌లెస్ హెడ్‌సెట్

ఏడు సంవత్సరాల బాలుడు అనుకోకుండా ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను మింగిన ఘటన అమెరికాలో జరిగింది. క్రిస్మస్ గిఫ్ట్‌గా వచ్చిన ఎయిర్‌పాడ్‌ను బాలుడు మింగడంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లి డాక్టర్లకు చూపించారు. జార్జియాలోని అట్లాంటాలోని చిల్డ్రన్స్ హెల్త్‌కేర్ ఆస్పత్రిలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డాక్టర్లు తీసిన ఎక్స్ రేలో.. ఎయిర్‌పాడ్‌ కడుపులో ఎటు కదలకుండా ఉండటంతో పాటూ చెక్కుచెదరకుండా ఉందని తేలింది. డాక్టర్లు ఆ గాడ్జెట్ దానంతట అదే బయటకు వెళ్తుంది అని చెప్పారు. దాంతో అతని తల్లిదండ్రులు మరో ప్రయత్నం చేయలేదు. బాలుడు ఎయిర్‌పాడ్‌ను మింగిన తర్వాత.. ఎటువంటి అనారోగ్యానికి గురికాలేదు. ప్రస్తుతం ఆ బాలుడు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ ఘటనతో బాలుడు మరింత భయపడ్డాడని అతని తల్లి తెలిపింది. ఏ ప్రమాదం లేదని, భయపడవద్దని బాలునికి చెప్పినట్లు అతని తల్లి తెలిపింది. ఎవరైనా ఎయిర్‌పాడ్‌ను మింగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం తైవాన్‌కు చెందిన వ్యక్తి కూడా అనకోకుండా ఎయిర్‌పాడ్‌ను మింగాడు.

Latest Updates