శామ్​సంగ్​ నుంచి వైర్​లెస్​ పవర్​బ్యాంక్​, చార్జర్

​న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ర్టానిక్స్​ కంపెనీ శామ్​సంగ్​ ఇండియా మార్కెట్లోకి వైర్​లైస్​ పవర్​బ్యాంకుతోపాటు చార్జర్​ డుయోపాడ్​ను విడుదల చేసింది. శామ్​సంగ్​ ఫోన్లతోపాటు ఇతర ఫోన్లనూ (క్యూఐ టెక్నాలజీ సర్టిఫైడ్​వి మాత్రమే) దీనితో వైర్​లైస్​గా చార్జ్​ చేసుకోవచ్చు. గెలాక్సీ బడ్స్​, గెలాక్సీ వాచ్​లనూ చార్జ్​ చేయవచ్చు. పవర్​ ​బ్యాంక్​లోనే వైర్​లెస్​ చార్జింగ్​ ప్యాడ్​ ఉంటుంది. వైర్​లెస్​తోపాటు వైర్​ ఉన్న డివైజ్​నూ ఇది చార్జ్​ చేస్తుంది. దీని ధర రూ.3,699. వైర్​లెస్​ చార్టర్​ డుయో ప్యాడ్​ ఒకే సమయంలో రెండు డివైజ్​లను చార్జ్​ చేయగలుగుతుంది. దీని ధర రూ. 5,999. ఈ రెండు పరికరాలు ఫాస్ట్​ చార్జింగ్​ను సపోర్ట్​ చేస్తాయి. శామ్‌‌‌‌సంగ్‌‌‌‌ ఈ–షాప్‌‌‌‌తో పాటు దేశవ్యాప్తంగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, ఆఫ్‌‌‌‌లైన్‌‌‌‌ స్టోర్లలో వీటిని కొనుక్కోవచ్చు.

Latest Updates