కారుపై 78 చలాన్లు : రూ.96 వేలు కట్టి తీసుకెళ్లాడు

ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ గా అమలుచేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. సిటీ అంతటా రోడ్లపై సీసీ కెమెరాలు బిగించి.. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోనివారికి చలాన్లు పంపి.. క్రమశిక్షణ అలవాటు చేస్తున్నారు.

మైత్రీవనం దగ్గర ఎస్సార్ నగర్ స్టేషన్ ట్రాఫిక్ పోలీసులు ఓ కార్ ను ఆపి లెక్కలు తీశారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉన్న ఆ కారుపై 78 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. మొత్తం రూ.96,830 బిల్లు ఉంది. వెహికల్ ను అక్కడే ఆపి… బిల్లు కట్టించారు పోలీసులు. ఈ చలాన్లు అన్నీ పే చేసి.. కార్ ను తనవెంట తీసుకెళ్లాడు దాని యజమాని.

Latest Updates