బయోపిక్ లో అనుష్క నటిస్తే నేను రెడీ

న్యూఢిల్లీ: తన బయోపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించడానికి సిద్ధమేనని టీమిండియా కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ అన్నాడు. అయితే తనతో పాటు అనుష్క శర్మ కూడా ఇందులో నటించాలని షరతు పెట్టాడు. లేకపోతే చేయనని వెల్లడించాడు. ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛెత్రితో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన కోహ్లీ.. చాలా అంశాలను పంచుకున్నాడు. ‘అనుష్క నా జీవితంలోకి వచ్చాక చాలా మారా. గతంలో ఇలా ఉండేవాడిని కాదు. ప్రతి వ్యక్తికి సొంత స్వభావం ఉంటుందని నా నమ్మకం. దీంతో పాటు ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ మార్పులు తెచ్చేవారు ఎవరో ఒకరు ఉంటారు. నా లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి అనుష్క వచ్చాకా ఆ మార్పు జరిగింది. మన లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇతరులను కూడా చూసుకోవాలి. అలా జీవించడం వల్ల నువ్వేంటో  తెలుస్తుంది. నా స్థాయి పెద్దదని, మరింత ఉత్తమంగా తీర్చిదిద్దుకోవాలని నాకు నేర్పింది. ఇప్పుడు వాస్తవ స్థితిలో జీవిస్తున్నా. ఎవరైనా ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తే.. దానిని సాల్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే స్థితిలో ఉంటే తప్పకుండా చేస్తా. అనుష్కను కలవకముందు చాలా స్వార్థపూరితంగా ఉండేవాడిని. నా కంఫర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రమే బతికేవాడిని. మనం లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసినప్పుడు వాళ్ల కోసం కూడా ఏదైనా చేయాలి. చాలా విషయాల్లో ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాలి. గతంలో మా మధ్య కూడా ఇలాంటి కాన్వర్జేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా జరిగాయి. నిలకడగా ఇలాంటి చర్చలు జరిగినప్పుడు వ్యక్తిగతంగా కాకుండా సహచర్యం గురించి ఆలోచిస్తాం. అనుష్క వచ్చాక ఇవన్నీ ఆలోచించేలా చేసింది’ అని విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. అనుష్క.. కోహ్లీకి చాలా సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇస్తుందని ఛెత్రీ కూడా అన్నాడు. విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటైనా మొత్తం మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూడటం గ్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని చెప్పాడు.

సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే నిద్ర పోయా..

ఓసారి అనుష్క సినిమా షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అక్కడే నిద్రపోయానని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. ‘గంటల తరబడి ఫ్లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్నీ చేసి అలసిపోయా. వెళ్లేసరికి నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో హోటల్ రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా దొరకలేదు. ఏం చేయాలని ఆలోచిస్తూ.. అనుష్క షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గరకు వెళ్లా. ఆలస్యం కావడంతో అక్కడే ఓ మంచంపై పడుకున్నా. కాసేపటి తర్వాత ఇద్దరం కలిసి హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిపోయాం. అలసిపోతే నేను నిద్రను ఆపుకోలేను’ అని విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లినప్పుడు సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే క్రమంలో అనుష్కను వదిలేసి వెళ్లిపోయా నన్నాడు. ఎవరో అభిమాని కలిస్తే మాట్లా డుతూ అలాగే ముందుకెళ్లానని, వెనకకు తిరిగి చూస్తే శర్మ కనిపించ లేదన్నాడు. మళ్లీ వెనక్కి వచ్చినప్పుడు అనుష్క.. తానెవరో తెలియనట్లు నటించిందని తెలిపాడు.

 

Latest Updates