వాతావరణ మార్పులతో.. వణికిస్తున్న సీజనల్​ వ్యాధులు 

రాష్ట్రంలో పెరుగుతున్న రోగాలు

కరోనాకు, సీజనల్‌ ఫ్లూకు ఒకేలా లక్షణాలు

వచ్చింది ఏ రోగమో తెలియక జనం కంగారు

జలుబు, దగ్గు, జర్వం లక్షణాలతో హాస్పిటళ్లకు క్యూ

ఫ్లూ లక్షణాలుంటే ట్రీట్‌మెంట్‌కు జంకుతున్న డాక్టర్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సీజనల్‌ జ్వరాలు పెరుగుతుండటంతో జనం టెన్షన్‌ పడుతున్నరు. కరోనాకు, ఈ రోగాలకు దాదాపు ఒకే లక్షణాలుండటంతో కంగారు పడుతున్నరు. ఏది కరోనానో, ఏది ఫ్లూనో తెలియక భయపడిపోతున్నరు. ఏం రోగమో తెలుసుకునేందుకు డాక్టర్ల దగ్గరకు పోతే ట్రీట్‌మెంట్‌ చేసేందుకు వాళ్లూ జంకుతున్నరు. ముందు కరోనా టెస్టులు చేయించుకురమ్మని చెబుతున్నరు. మొత్తానికి గత వారం రోజులుగా రోగులతో హాస్పిటళ్లు నిండిపోతున్నయి.

వాతావరణం ఒక్కసారిగా మారడంతో..

రాష్ట్రంలో వారం పది రోజులుగా చలి ఇబ్బంది పెట్టగా రెండ్రోజుల కిందట టెంపరేచర్లు పడిపోయాయి. బుధవారం చిరుజల్లులు పడ్డాయి. వాతావరణం ఒక్కసారిగా మారడంతో చాలా మంది జనం జ్వరాల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బందిపడుతున్నారు. కరోనాకూ ఇలాంటి లక్షణాలే ఉండటంతో జనాల్లో భయం ఎక్కువైంది. పైగా కరోనా సెకండ్ వేవ్ టెన్షన్‌‌, బ్రిటన్‌‌ స్ట్రెయిన్‌‌ వైరస్‌‌లతో మరింత టెన్షన్‌‌ పడుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేనోళ్లకే పాజిటివ్‌‌ వస్తోందని, ఇన్ని సింప్టమ్స్‌‌ ఉన్న తమకు వచ్చిందేమోనని కంగారుపడుతున్నారు. ట్రీట్‌‌మెంట్‌‌ కోసం హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు. దీంతో వారం రోజులుగా రాష్ట్రంలోని హాస్పిటళ్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి.

ఆన్‌‌లైన్ కన్సల్టేషన్.. సెల్ఫ్ మెడికేషన్

కొవిడ్‌‌ కారణంగా ఆన్‌‌లైన్‌‌ కన్సల్టేషన్‌‌కు డిమాండ్‌‌ పెరిగింది. చిన్న ఆస్పత్రుల నుంచి కార్పొరేట్‌‌ హాస్పిటళ్ల వరకు అన్నీ ఆన్‌‌లైన్‌‌లో సలహాలు ఇస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలుంటే టెన్షన్‌‌ పడొద్దని.. చలికాలంలో ఇవన్నీ కామన్‌‌ అని ధైర్యం చెబుతూ ట్రీట్‌‌మెంట్‌‌ చేస్తున్నాయి. ఈ – కామర్స్‌‌ మెడికల్‌‌ యాప్‌‌లూ జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి లాంటి లక్షణాలుంటే భయపడొద్దంటూ రెమెడీస్‌‌ చెబుతున్నాయి. డాక్టర్ల దగ్గరకు పోవడానికి భయపడుతున్న వాళ్లు సొంతంగా ఆవిరి పట్టడం, మిరియాల కషాయం వంటి హోం రెమెడీస్‌‌తో ఫ్లూ నుంచి బయటపడుతున్నారు.

ఓపీకి పెరిగిన తాకిడి

వారం రోజులుగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ హాస్పిటల్, బస్తీ దవాఖాన్లు, క్లినిక్‌‌లకు రోగుల తాకిడి ఎక్కువైంది. ఉస్మానియా హాస్పిటల్‌‌కు రోజువారి జనరల్ ఓపీకి 910 మంది పేషెంట్లు వస్తే అందులో 200 మంది ఫీవర్‌‌తో వస్తున్నారు. నిలోఫర్‌‌కు రోజూ 710 మంది వస్తుండగా అందులో 180 వరకు.. నిమ్స్‌‌కు 1,317 మంది వస్తుండగా 200 వరకు ఫీవర్ కేసులు ఉంటున్నాయి. గాంధీలో 8 వందల ఓపీకి గాను 200 మందికి పైగా జ్వరం, దగ్గు , జలుబుతో వస్తున్నా\రు. పెద్దాసుపత్రులతో పాటు ఏరియా హాస్పిటళ్లకు రోజూ 200 నుంచి 300 మంది రోగుల తాకిడి ఉంటోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రులు, ప్రైమరీ హెల్త్‌‌ కేర్‌‌ సెంటర్లు, నర్సింగ్‌‌ హోంలు, ప్రైవేటు క్లినిక్‌‌లు కూడా పేషెంట్లతో నిండిపోతున్నాయి.

టెన్షన్‌‌ పడొద్దు

క్లైమెట్ చేంజ్ వల్ల సీజనల్‌‌ వ్యాధులు ఎక్కువయ్యాయి. దీంతో వారం నుంచి ఓపీ పెరిగింది. రోజూ 7 వందల మంది పేషెంట్లు వస్తున్నారు. హాస్పిటల్‌‌కు వస్తున్న వాళ్లలో వైరల్ ఫీవర్, దగ్గు, గొంతు నొప్పి, జలుబు లాంటి లక్షణాలున్నవాళ్లే ఎక్కువున్నారు. కరోనాకు, సీజనల్ ఫ్లూకు లక్షణాలు ఒకేలా ఉంటాయి. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్‌‌కు వస్తున్న వారికి యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నం. నెగెటివ్ రిపోర్టులే వస్తున్నాయి. – డాక్టర్ పద్మజ (ఆర్ఎంవో, ఫీవర్ హాస్పిటల్)

కరోనానా, ఫ్లూనా చూడంగనే చెప్పలేం

కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా హాస్పిటల్‌‌కు వస్తున్నారు. వారం క్రితం ఓపీకి 30, 40 మంది పేషెంట్స్ వస్తే ఇప్పుడు 60 నుంచి 80 మంది వరకు వస్తున్నారు. హాస్పిటల్‌‌కు వస్తున్న వాళ్లతో పాటు ఆన్‌‌లైన్‌‌లోనూ చాలా మంది కన్సల్ట్ అవుతున్నారు. కరోనా ఏది, సీజనల్ ఫ్లూ ఏది అని చూడగానే చెప్పలేం. లక్షణాలు బట్టి టెస్టులు చేయాలి. ప్రాబ్లమ్‌‌ ఎక్కువగా ఉంటే డాక్టర్‌‌ను సంప్రదించడం మంచిది.-డా.నవోదయ (ఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్).

మీ ఫోన్ మీ ఇష్టం.. కస్టమర్లకు నచ్చినట్లు ఫోన్ యారుచేసిస్తామంటున్నఇండియన్ మొబైల్ కంపెనీ

నడిసొచ్చిన దారిలో నలుగురికి సాయం చేస్తున్నారు

పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం

Latest Updates