7.19లక్షలకు చేరిన కరోనా కేసులు

  • 24 గంటల్లో 22వేల కేసుల నమోదు
  • 467 మంది మృతి

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 24 గంటల్లో మొత్తం 22,252 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం నాటికి కేసుల సంఖ్య 7,19,665కి చేరిందని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ బులిటెన్‌రిలీజ్‌ చేసింది. 467 మంది చనిపోయారు. నాలుగు రోజుల్లో కేసుల సంఖ్య 6లక్షల నుంచి 7లక్షలకు చేరింది. ఈ నెల 3 నుంచి దాదాపు రోజు 20వేల కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల్లో ప్రపంంలోనే మూడో స్థానానికి చేరిన ఇండియాలో మరణాల రేటు మాత్రం చాలా తక్కువగా ఉంది. వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు 4,39,947 మంది రికవరీ అయ్యారని, గడచిన 24 గంటల్లో 15,515 మందికి వ్యాధి నయం అయిందని అన్నారు. ఇక దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో నమోదవుతోంది. ఇప్పటి వరకు 2,1,987 కేసులు ఉండగా.. 9,026 మంది చనిపోయారు. తమిళనాడులో 11498 కేసులు ఉండగా.. 1517 మంది చనిపోయారు. ఢిల్లీలో 100823 కేసులు ఉండగా 3115 మంది చనిపోయారు.

Latest Updates