‘ప్రైమ్‌ డే సేల్‌’తో 209 మంది కోటీశ్వరులు అయ్యారు: అమెజాన్

రెండు రోజుల ఈవెంట్‌లో 91 వేల మంది వ్యాపారులు

అమెజాన్‌‌ ఇండియా’స్ హెడ్‌‌ అమిత్‌ అగర్వాల్‌    

బిజినెస్‌‌ డెస్క్‌ , వెలుగు: రెండు రోజులు జరిగిన ‘అమెజాన్‌‌ ప్రైమ్‌‌ డే సేల్‌‌’ తో 209 మంది సెల్లర్లు కోటీశ్వరులు అయ్యారని ఈ–కామర్స్‌‌ కంపెనీ అమెజాన్ చెబుతోంది. మరో 4,000 మంది చిన్న వ్యాపారులు రూ.10 లక్షల విలువైన అమ్మకాలు జరిపారని పేర్కొంది. ఆగస్ట్‌‌ 7, 8 తేదీలలో ప్రైమ్‌‌డే సేల్స్‌‌ను అమెజాన్‌‌ చేపట్టింది. కంపెనీ ప్లాట్‌‌ఫామ్‌‌ ద్వారా 91 వేల మంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు తమ ప్రొడక్ట్‌‌లను అమ్ము కోగలిగారని అమెజాన్‌‌ ఇండియా హెడ్‌‌ అమిత్‌ అగర్వాల్‌‌ అన్నారు.

కళాకారులు, చేనేత పనివారు 6.7 రెట్లు, అమెజాన్‌‌ షహేలి ద్వారా మహిళలు 2.6 రెట్లు గ్రోత్‌ ను చూశారని చెప్పారు. అమెజాన్ లాంఛ్‌‌ ప్యాడ్‌‌ ద్వారా స్టార్టప్‌ బ్రాండ్‌‌ల అమ్మకాలు 2.1 రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. విలువ పరంగా చూస్తే లార్జ్‌ అప్లెయెన్సెస్‌‌, కిచెన్‌‌, స్మార్ట్‌‌ఫోన్‌‌ సెగ్మెంట్‌‌లలో అమ్మకాలు ఎక్కువగా జరిగాయని అన్నారు. అదే యూనిట్ల పరంగా చూస్తే బట్టలు‌‌, పాంట్రీ సెక్షన్‌‌లో ఎక్కువ సేల్స్‌‌ అయ్యాయని పేర్కొన్నారు. చిన్న,మధ్య తరహా వ్యాపారాల సేల్స్‌‌ పెంచేందుకు క్యాష్‌ బ్యాక్స్‌‌, కూపన్స్‌‌ వంటివి ప్రొవైడ్‌‌ చేశామని అమెజాన్‌‌ చెబుతోంది. గతేడాదితో పోలిస్తే అమెజాన్‌‌లో సెల్లర్ల రిజిస్ట్రేషన్‌‌ 50 శాతం పెరిగిందని అమిత్ అన్నారు.

కొత్త మెంబర్లలో 65 శాతం మంది టాప్‌ 10 సిటీలకు వెలుపల నుంచి వచ్చిన వారేనని చెప్పారు. ఆన్‌‌లైన్ షాపింగ్‌‌ ట్రెండ్‌‌ పెరుగుతోందని, బిజినెస్‌‌లు కూడా తిరిగి పుంజుకోవడానికి ఆన్‌‌లైన్‌‌ బాట పడుతున్నాయని అన్నారు. కరోనా ముందు స్థాయికి ఈ–కామర్స్ సేల్స్‌‌.. లాక్‌‌డౌన్‌‌ రెస్ట్రి క్షన్స్‌‌ తొలిగిన తర్వాత మొదటి సారిగా అతిపెద్ద ప్రమోషనల్‌‌ ఈవెంట్‌‌ను అమెజాన్‌‌ కండక్ట్‌‌ చేసింది. ఫ్లిప్‌ కార్ట్‌‌ జూన్‌‌లో తన సేల్‌‌ ఈవెంట్‌‌ను జరిపింది. అంతేకాకుండా ఆగస్ట్‌‌ 6–-10 వరకు బిగ్‌‌సేవిం గ్స్‌‌ డేను చేపట్టింది. లాక్‌‌డౌన్‌‌ నుంచి మినహాయింపులొచ్చిన కొద్ది కాలంలోనే ఈ–కామర్స్‌‌ ఇండస్ట్రీలో గ్రోత్‌ కనిపిస్తోందని విశ్లేషకులు అన్నారు . గ్రోసరీ, ఎసెన్షియల్‌‌ ప్రొడక్ట్‌‌ల అమ్మకాలు పెరగడంతో, ఆన్‌‌లైన్‌‌ రిటైలర్లు ఇప్పటికే వాల్యూమ్‌‌ పరంగా ప్రీకోవిడ్‌‌ లెవెల్‌‌ సేల్స్‌‌కు చేరుకున్నారని చెప్పారు. విలువ పరంగా కూడా ఆన్‌‌లైన్‌‌ రిటైలర్ల అమ్మకాలు ప్రీ లాక్‌‌డౌన్‌‌ లెవెల్‌‌ను అందుకుంటున్నాయని అన్నారు.

ప్రైవేట్లేబుల్ బ్రాండ్స్‌‌ సేల్స్‌‌ పెరిగాయ్‌ !

తన ప్రైవేట్ లేబుల్‌‌ బ్రాండ్స్‌‌ అమ్మకాల వివరాలను అమెజాన్ బయటపెట్టలేదు. ప్రెస్టో, సింబల్‌‌, మైక్స్‌‌, హౌస్‌‌ అండ్‌‌ సీల్డ్స్‌‌, అర్థర్‌‌‌‌ హార్వే, సోలిమో, వెడకా, అమెజాన్ బేసిక్స్‌‌ వంటివి అమెజాన్‌‌ ప్రైవేట్‌‌ లేబుల్‌‌ బ్రాండ్స్‌‌. వీటి వివరాలు నా దగ్గరలేవని, ఫైర్‌ ‌‌‌స్టిక్ వంటి అమెజాన్ డివైస్‌‌ల అమ్మకాలు మాత్రం పెరిగాయని అమిత్‌ పేర్కొన్నారు. థర్డ్‌‌ పార్టీ సెల్లర్ల డేటాను యూజ్‌‌ చేసుకొని తమ సొంత ప్రొడక్ట్‌‌లను తయారు చేస్తున్నారా? అని గత నెల యూఎస్‌‌ కాంగ్రెస్‌‌ అమెజాన్‌‌ ఫౌండర్‌‌‌‌ జెఫ్‌ బెజోస్‌‌ను ప్రశ్నించింది. ఈ విషయాన్ని బెజోస్‌‌ ఖండించకపోవడం గమనార్హం. ప్రైమ్‌‌ డే మొదటి రోజు అమెజాన్‌‌ ఎకో డివైస్‌‌లు ఫైర్‌‌‌‌ టీవీ స్టిక్‌‌, కిండిల్‌‌ ఎక్కువగా అమ్ముడుపోయాయని సంబంధిత వ్యక్తులు చెప్పారు.

 

Latest Updates