అదనపు ఇందనం లేకుండానే…ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానం

ఉదయం 8.50 గంటలు. ప్రత్యేక రన్​వేపై ఎయిరిండియా 560 విమానం దిగింది. అందులో కొత్తేముంది..ఎప్పుడూ జరిగేదే కదా అని అనొచ్చు. కానీ, కొత్తదనం ఉంది. ఇంధన ఆదా, కాలుష్య కారకాల తగ్గింపే లక్ష్యంగా ఎయిరిండి యా సరికొత్త శకానికి నాంది పలికింది. దానికి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం వేదికైంది. అదనపు ఇంధనం లేకుండానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఎయిరిండియా విమానం ప్రయాణించి.. మొట్టమొదటి విమానంగా రికార్డు సృష్టించింది. దాని వల్ల విమానం బరువు 4 టన్నులు తగ్గడమే కాకుం డా.. 140 కిలోల ఇంధనమూ ఆదా అయింది. విమానయాన నిబంధనల ప్రకారం విమానాలను వేరే ఎయిర్ పోర్టుకు దారి మళ్లించాల్సి వచ్చినప్పుడు అవసరమయ్యేం త అదనపు ఇంధనాన్ని తీసుకెళ్లడం తప్పనిసరి చేశారు. దాని వల్ల విమానాలు అదనపు బరువుతో వెళ్లాల్సి వస్తోంది. ఆ బరువుకు ఇంధనం ఎక్కువ అయిపోవడంతో పాటు ఎమిషన్స్​ కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా తొలిసారిగా అదనపు ఇంధనం లేకుండానే హైదరాబాద్ కు విమానం నడిపింది. రాబోయే రోజుల్లో ప్రస్తుతం హైదరాబాద్ కు నడుపుతున్న 15 విమానాలనూ అదనపు ఇంధనం లేకుండానే నడుపుతామని సంస్థ అధికారి ఒకరు చెప్పారు. అదనపు ఇంధనంతో వెళ్లాలని ఏవియేషన్​ నిబంధనలు చెబుతున్నాయని, దాంతోపాటే సు రక్షితంగా తీసుకెళ్లే మార్గాలుంటే అదనపు ఇంధనం లేకుండా కూడా నడపొచ్చన్న నిబంధనా ఉందని చెప్పారు. అయితే, అదనపు ఇంధనం లేకుండా ప్రయాణించిన విమానాలు దిగే ఎయిర్ పోర్టుల్లో రెండు రన్​వేలు, మంచి వాతావరణం ఉండాలి. అందులో భాగంగానే పౌర విమానయాన శాఖ, డైరెక్టర్ జనరల్​ ఆఫ్ సివిల్​ ఏవియేషన్​, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్​, భారత వాతావరణ శాఖ, ఎయిరిండి యా, ఇండి గో, స్పైస్​జెట్ , ఎయిర్ ఏసియాలు అదనపు ఇంధనం లేకుండా విమానాలు నడిపేందుకు కలసికట్టుగా నిర్ణయం తీసుకున్నాయి.ఎయిరిండియా అమలు చేసింది. ఇతర ఆపరేటర్లూ ఈ పద్ధతిని అమలు చేస్తే ఇంధనం భారీగా ఆదా అవడంతో పాటు ఎమిషన్స్​ తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

Latest Updates