వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ..హత్య చేసి.. చనిపోయాడని నిర్దారించుకొని

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడంటూ  బాధితుణ్ని హత్య చేసిన నిందితుల్ని జవహార్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది జవరహార్ నగర్ దేవేందర్ నగర్ కాలనీ చెందిన భూమదాస్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు.

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..జవహార్ నగర్ కు చెందిన భూమదాస్ కు అనారోగ్య సమస్యల కారణంగా ఇద్దరు భార్యలు మృతి చెందారు. దీంతో ఒంటరిగా జీవిస్తూ స్థానికంగా ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో పనిచేస్తున్నాడు. అదే సమయంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆ మహిళకు సికింద్రాబాద్ లో సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే రాజుతో పరిచయం ఉంది. అయితే ఈ  వివాహేతర బంధాన్ని కొనసాగించొద్దని భూమదాస్ మహిళను, రాజును హెచ్చరించారు.

అదే సమయంలో ఆగస్ట్ 4, 2019న నిందితుడు ఏ1రాజు, నిందితురాలు (ఏ2)  దేవేందర్ నగర్ లోని మొబైల్ షాపుకెళ్లి మొబైల్ కొనుగోలు చేశారు.  అనంతరం అక్కడ మధ్యం తాగారు. రాత్రిసమయంలో భోజనం చేసేందుకు  భూమదాస్ పనిచేస్తున్న బార్ అండ్ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ భూమదాస్ రాజును చూడడంతో వారి మధ్య గొడవ జరిగింది. రాజును భూమదాస్ కు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది నిందితురాలు. భూమదాస్ ను సముదాయించి రాజును అక్కడి నుంచి దేవేందర్ నగర్ కాలనీలో ఉన్న తన గదికి తెచ్చింది నిందితురాలు. రాజు, నిందితురాలి వాలకంపై అనుమానం వచ్చిన బాధితుడు భూమదాస్  అర్ధరాత్రి సమయంలో నిందితులిద్దరు ఉన్న గది తలుపు తట్టాడు. తలుపు తీయడంతో రాజు కనిపించడంతో ఇక్కడ ఎందుకున్నాడంటూ నిందితురాలిని నిలదీశాడు.

ముందస్తు పథకం ప్రకారం  తమ వివాహేతర బంధానికి భూమదాస్ అడ్డొస్తున్నాడని ఆగ్రహించిన రాజు పక్కనే ఉన్న అల్యూమిలియం పైప్ తలపై కొట్టి, కత్తి దాడి చేశారు. బాధితుడి ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్న తరువాత అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు సంవత్సరం జవహర్ నగర్ పోలీసులు రెక్కీ నిర్వహించి నిందితుల్ని  అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates