రాష్ట్రపతి భవన్‌లో కరోనా పాజిటివ్ కేసు

రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో దాదాపు 125 మంది స్టాఫ్ ను అధికారులు క్వారంటైన్ చేసినట్టు తెలుస్తోంది. నాలుగు రోజుల క్రితమే ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో సెక్రటరీ స్థాయి అధికారులు, వారి కుటుంబ సభ్యులందరినీ సెల్ఫ్ హోం క్వారంటైన్‌లో ఉండాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కార్మికులను మాత్రం సెంట్రల్ ఢిల్లీలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. అయితే.. పరీక్షల్లో వీరందరికీ నెగటివ్ రిపోర్టులు వచ్చాయి.

Latest Updates