నా భర్తకు అమ్ముడుపోయావా అని కానిస్టేబుల్ పై మహిళ దాడి

హర్యానాలోని పల్వాల్ లో ఓ మహిళ తెగువ చూపించింది. తానిచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోవడం లేదంటూ కానిస్టేబుల్ పై దాడికి దిగింది. అందరూ చూస్తుండగానే కానిస్టేబుల్ తో వాదనకు దిగింది. ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని ప్రశ్నించింది. తన భర్త  దగ్గర డబ్బులు తీసుకుని అమ్ముడుపోయారని ఆ మహిళ ఆరోపించింది.

తన భర్త మరొక మహిళతో సంబంధం కొనసాగిస్తూ తనను మోసం చేస్తున్నారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు స్పందించడం లేదంటూ ఆగ్రహంతో ఇలా కానిస్టేబుల్ పై దాడికి దిగింది. స్థానికులు కూడా మహిళకు మద్దతుగా నిలిచారు. దీంతో మహిళ భర్తను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

see also: సూర్యగ్రహణం ఎఫెక్ట్ : చూపు పోగొట్టుకున్నారు

అట్లాస్ సైకిల్స్ వైస్ ప్రెసిడెంట్ భార్య సూసైడ్

‘మంజు చాలామందితో…. అందుకే చంపేశా’

Latest Updates