బండి ఆపినందుకు పోలీసు గల్లా పట్టుకున్న హైదరాబాద్ మహిళ

లాక్ డౌన్ దృష్ట్యా ప్రజలెవరూ రోడ్లమీదికి రావొద్దని దేశ ప్రధాని సూచించారు. అయినా జనం మాత్రం పెడచెవిన పెట్టి… ఆ పని, ఈ పని అని రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. దాంతో పోలీసులకు వారిని అడ్డుకోవడం పెద్ద సవాలుగానే మారింది. అనవసరంగా రోడ్ల పైకి వచ్చిన వాళ్లని ఆపి.. ఫైన్లు వేస్తున్నారు. ఒక్కొచోట అయితే ఏకంగా బండే సీజ్ చేస్తున్నారు. ఇలా ప్రతిరోజూ కొన్ని వేల కేసులు నమోదు అవుతున్నాయి. అయినా జనాల్లో ఏ మాత్రం భయం కనిపించడంలేదు.

శుక్రవారం హైదరాబాద్ లోని లాలాపేటలో ఒక మహళ, మరో ఇద్దరు వ్యక్తులతో బండిపై వెళ్తుంది. లాలాపేట చెక్ పోస్టు పోలీసులు వారిని ఆపి, లాక్ డౌన్ రూల్స్ ఉల్లఘించినందుకు చలాన్ రాశారు. దాంతో ఆ మహిళ రెచ్చిపోయి.. సదరు పోలీసు అధికారి గల్లా పట్టుకొని దాడికి దిగింది. దాంతో ఆ మహిళపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘ఒకే బైక్‌పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తుండటంతో పాటు.. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు లాలాపేట్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న పోలీసులు వారిని ఆపారు. రూల్స్ బ్రేక్ చేసినందుకు చలాన్ రాసి ఇస్తుండగా.. ఆ మహిళ మరియు ఆమెతో ఉన్నవారు పోలీసులతో వాదనకు దిగారు. ఆ మహిళ అయితే చలాన్ రాసిన అధికారి గల్లా పట్టుకొని దాడికి దిగింది. అందుకే వారందరిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నాం’ అని మల్కాజ్‌గిరి ACP అన్నారు.

మధ్యప్రదేశ్ లో కూడా హెల్త్ వర్కర్లపై కొంతమంది దాడులు చేశారు. దాంతో పోలీసులపై, వైద్యులపై ఎవరైనా దాడులకు దిగితే కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలీలా శ్రీవాస్తవ ఆదేశించారు. దానికి సంబంధించిన ఆర్డర్ ను కూడా రాష్ర్ర ప్రభుత్వాలకు పంపుతున్నట్లు ఆమె తెలిపారు.

Latest Updates