కామాంధుడిని కట్టేసి కొట్టిన వివాహిత

తనతో అసభ్యంగా ప్రవర్తించిన ఒక తాగుబోతుకి చెప్పుతో బుద్ధి చెప్పింది ఓ మహిళ. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ దేవేందర్ నగర్ లో జరిగింది. నడిరోడ్డపై ఒంటరిగా వస్తున్న  వివాహితను తాగిన మైకంలో ఉన్న ఓ యువకుడు అడ్డగించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో ఆ మహిళ అక్కడి నుండి చాకచక్యంతో తప్పించుకుని స్థానికులకు విషయం తెలిపింది. వెంటనే ఆ వ్యక్తిని పట్టుకుని స్థానికుల సాయంతో స్తంభానికి కట్టేసి బాధిత మహిళా చెప్పుతో చెంప చెల్లుమనిపించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని పోలీసులకు అప్పజెప్పారు. అక్కడ స్థానికంగా ఉన్న హర్షిత ఎన్​ క్లెవ్​ లోని నిర్మాణుష్య స్థలం పోకిరీలకు, తాగుబోతులకు అడ్డగా మారిందని, తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అక్కడి మహిళలు పోలీసులకు తెలిపారు.

Latest Updates