అత్తామామలను చంపిన కోడలు జైలులో ఆత్మహత్య

అత్తామామలను చంపిన కేసులో అరెస్టయిన ఓ మహిళ జైలులో ఉరివేసుకొని చనిపోయింది. ఢిల్లీలోని చావ్లా పరిధిలో నివాసముండే పర్వీనా(కవిత) ఏప్రిల్ 24న ఇంట్లోనే భర్త సహకారంతో అత్తామామలను చంపేసింది. ఆ కేసులో భార్యభర్తలిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. పర్వీనాను తీహార్ జైలులో ఆరో నెంబర్ సెల్ లో ఉంచారు. ఆమె ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తన దుపట్టాతో ఉరేసుకొని చనిపోయింది.

జంట హత్యల కేసులో అరెస్టయిన పర్వీన్ తన సెల్‌లో దపట్టాతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఆమెను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఏప్రిల్ 24న భర్త సహకారంతో అత్తమామలను చంపిన పర్వీనాను ఏప్రిల్ 25న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు, ఆమె భర్తకు కోర్టు రిమాండ్ విధించింది. పర్వీనాకు ఏమనిపించిందో ఏమో కానీ కేసు విచారణలో ఉండగానే ఉరేసుకొని చనిపోయింది అని తీహార్ జైలు అధికారి తెలిపారు.

పర్వీనా ఆత్మహత్యను సెక్షన్ 176 కింద నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

For More News..

నిలోఫర్ నర్సుకు కరోనావైరస్

కాసేపట్లో పెళ్లిమండపానికి చేరిక.. అంతలోనే వరుడి కారులో మంటలు..

దేశచరిత్రలోనే కొత్త పథకం.. నేడు ఏపీలో ప్రారంభం

లాక్డౌన్ ఎఫెక్ట్: చెక్క పడవలో 1100 కిలోమీటర్ల ప్రయాణం

Latest Updates