డ్వాక్రా రుణం ఇవ్వలేదని మహిళ ఆత్మహత్యాయత్నం

కామారెడ్డి జిల్లా : డ్వాక్రా గ్రూపులో రుణం ఇవ్వలేదని మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన 3 రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజంపేట మండలం, కొండాపూర్ గ్రామానికి చెందిన కీసరి వెంకవ్వ గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వారం రోజుల క్రితం డ్వాక్రా గ్రూపుకు రూ. 3 లక్షల రుణం వస్తే, మిగతా సభ్యులు తీసుకుని తనకు ఇవ్వలేదని మనస్థాపం చెందింది వెంకవ్వ. అప్పు తెచ్చి రుణం కట్టానని.. అయినా రుణం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వెంకవ్వ కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు డాక్టర్లు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామన్నారు పోలీసులు.

Latest Updates