ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకి మహిళ ఆత్మహత్య

కుటుంబ కలహల కారణంగా ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో సహ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది. సర్వాపుర్ గ్రామానికి చెందిన స్వప్న(23) ,తన ఇద్దరు బిడ్డలతో మాల్యాల్ మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ బావిలో దూకి  ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి నుంచి పిల్లలతో సహా బయటకు వెళ్లిన స్వప్న.. ఆ తర్వాత ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.  పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. స్థానికంగా ఉన్న బావిలో వారి ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవలే ఆమె భర్త దుబాయ్ నుంచి వచ్చాడని, కుటుంబకాలహాల కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

Latest Updates