వ్యాధి తగ్గడం లేదని  ఆత్మహత్య

చందానగర్ పీఎస్ పరిధిలో ఉరేసుకుని చనిపోయిన మహిళ

చందానగర్,వెలుగు: వ్యాధి తగ్గడం లేదని మానసిక ఆందోళనతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్​పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం  ప్రకారం.. కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన జి. వెంకటేశ్వర్​రెడ్డి భార్య సులోచన(38) 2015 నుంచి బ్రెస్ట్​ క్యాన్సర్​తో భాదపడుతోంది. చందానగర్​ బాపునగర్​లోని సాయిసూర్య రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తన పిన్నీ లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి  నిమ్స్​హాస్పిటల్ లో కొన్ని రోజులుగా  ట్రీట్ మెంట్ తీసుకుంటోంది. హాస్పిటల్ డాక్టర్లు ఈ నెల 17న సులోచనకు సర్జరీ చేయాలనుకున్నారు. తనకు వచ్చిన బ్రెస్ట్​ క్యాన్సర్ సర్జరీ​ చేస్తే తగ్గుతుందో లేదో అని మానసికంగా ఆందోళన చెందిన సులోచన బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్​కు  చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె  పిన్నీ లక్ష్మీదేవి గమనించి సులోచనను స్థానికుల సాయంతో  ప్రైవేటు హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో సులోచన తల్లి నారాయణమ్మ చందానగర్​ పోలీసులకు కంప్లయింట్ చేసింది.   కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అహ్మద్ పాషా తెలిపారు.

Latest Updates