పెళ్లి చేసుకుంటానని మోసం.. పబ్ చెఫ్ పై ఫిర్యాదు

V6 Velugu Posted on Dec 04, 2021

జూబ్లీహిల్స్, వెలుగు:  పెళ్లిచేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ చెఫ్​పై యువతి శుక్రవారం జూబ్లీహిల్స్  పీఎస్​లో ఫిర్యాదు చేసింది. ఏపీకి చెందిన ఓ యువతి 3 నెలల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నం.36 లోని కెమిస్ట్రీ పబ్​లో అసిస్టెంట్ చెఫ్ గా చేరింది. ఒడిశాకు చెందిన సత్యజిత్ పాల్ అక్కడే చెఫ్​గా పనిచేసేవాడు. ఆమెకు అతడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లిచేసుకోవాలని యువతి సత్యజిత్​ను అడగగా..అతడు ఒప్పుకోలేదు. ప్రేమ, పెళ్లి పేరుతో సత్యజిత్ మోసం చేశాడని ఆమె జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. సత్యజిత్​పై కేసు ఫైల్ చేశారు. అతడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Tagged pub chef, fir on pub chef, jubilee hills pub, woman complaint on chef

Latest Videos

Subscribe Now

More News