టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి అరాచకం

తనకు విడాకులిచ్చి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే కారణంగా ఆమె రెండో భర్తను కిడ్నాప్ చేశాడు మొదటి భర్త. టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి అయిన మేకల విద్యాసాగర్ కరిష్మా అనే యువతిని మొదట వివాహం చేసుకున్నాడు. అయితే వారి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు రావడంతో ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు.

కరిష్మా నుంచి విడాకులు తీసుకున్న తర్వాత  విద్యాసాగర్ తో మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. కరిష్మా కూడా మౌర్య అనే మరొ వ్యక్తిని పెళ్లాడింది. అయితే కరిష్మా మరో పెళ్లి విషయం నచ్చని విద్యాసాగర్.. ఆమె భర్త మౌర్యను కిడ్నాప్ చేశాడు. తన భర్తను కిడ్నాప్ చేశాడని మాజీ భర్త విద్యాసాగర్ పై KPHB పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కరిష్మా. అతను టీఆరెస్ నాయకుడు కావడం వల్ల పోలీసులు దర్యాప్తు చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తను విడిపించాలని కోరుతోంది.

Latest Updates