నడిరోడ్డుపై మహిళ ప్రసవం

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనపై అందరూ చర్చించుకుంటున్నారు. మహోబా జిల్లా హాస్పిటల్ ఎదుట ఓ మహిళ నడిరోడ్డుపై ప్రసవించింది. ఆ సంబంధీకులు.. చుట్టూ బట్టలు అడ్డుపెట్టి… ప్రసవం నిర్వహించారు. హాస్పిటల్ వాళ్లను అడిగితే కనీసం స్ట్రెచర్ ఇవ్వలేదని…. నొప్పులు ఎక్కువ కావడంతో.. రోడ్డుపైనే ప్రసవం జరిగిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు.

ఐతే.. దీనిపై మాతా శిశు విభాగం అధికారి, డాక్టర్ ఎస్కే సింగ్ మరోవెర్షన్ వినిపించారు. గర్భిణి హాస్పిటల్ కు రావడం లేట్ అయి ఉండొచ్చని అన్నారు. ఆమెకు డెలివరీ అవుతుందని తెలిసి.. ఆ తర్వాత హాస్పిటల్ లో తల్లి, బిడ్డను చేర్చుకున్నామని.. వారిద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు.

Latest Updates