శ్రామిక్ స్పెషల్ ట్రైన్ లో మహిళ డెలివరీ

వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాటు చేసిన శ్రామిక్ స్పెషల్‌ ట్రైన్ లో ఓ గర్భిణీ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఒడిశాకు చెందిన మీనా కుంభర్‌ అనే గర్భిణీ మహిళ తన కుటుంబసభ్యులతో కలిసి తెలంగాణలోని లింగంపల్లి నుంచి ఒడిశాలోని బాలాంగిర్‌కు ప్రత్యేక రైలులో వెళ్తోంది. అయితే మార్గమధ్యలో మీనా కుంభర్‌ డెలివరీ అయింది. శుక్రవారం ఉదయం 5.40 నిమిషాలకు రైలు టిట్లాగఢ్‌ స్టేషన్‌ కు రాగానే..రైల్వే వైద్య సిబ్బంది తల్లీబిడ్డలను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత తల్లీబిడ్డను ఏడీఎంవో సూచనలతో జనని అంబులెన్స్‌ లో జిల్లా సబ్‌ డివిజనల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే పరిధిలోని శ్రామిక స్పెషల్‌ ట్రైన్ లో ఇప్పటివరకు ముగ్గురు చిన్నారులు జన్మించారు.

Latest Updates