పొలంలోకి దూస్కెళ్లిన కారు… మహిళ మృతి

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్వర్తి గేట్ సమీపంలో మారుతి స్విఫ్ట్  కారు డివైడర్ ను ఢీ కొని రోడ్డుకు పక్కనే ఉన్న పొలంలోకి దూస్కెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోయింది. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన మహిళ శంకర్ పల్లి మండలం కొజ్జగుడా గ్రామానికి చెందిన  కొత్తపల్లి సత్యమ్మ వయస్సు (55 ) గా గుర్తించారు.

కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని… పొలంలో పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న కొత్తపల్లి సత్యమ్మను  ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలిని చేవెళ్ళ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణం అని తెలుస్తోందన్నారు పోలీసులు.

Latest Updates