పరుగెడుతుండగా గుండె ఆగింది:పోలీస్ పరీక్షల్లో యువతి మృతి

కరీంనగర్: పోలీసు ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలన్న తపనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. కానిస్టేబుల్ సెలెక్షన్స్ లో భాగంగా నిర్వహించిన రన్నింగ్ రేస్ లో గుండె ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో నిర్వహిస్తున్న పోలీసు ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల్లో ఈ విషాద ఘటన జరిగింది.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామానికి చెందిన వడ్లకొండ మమత అనే యువతి కానిస్టేబుల్ సెలక్షన్ వచ్చింది. ఫిట్ నెస్ పరీక్షల్లో భాగంగా రన్నింగ్ రేస్ లో పరుగు ప్రారంభించింది. రన్నింగ్లో ముందుండాలని వేగంగా పరిగెత్తిన ఆమెకు ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది. ఉన్నట్టుండి పడిపోయింది. వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా గుండె ఆగి మరణించిందని చెప్పారు. ఆ యువతి తండ్రి సంపత్  ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కూతుళ్లు. మమత పెద్దమ్మాయి.

ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటుందనుకున్న సమయంలో ఇలా జరగడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలలసిపోయేలా ఏడ్చారు. కుటుంబమంతా భోరున విలపించింది. వారి ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

Latest Updates