సముద్రపు ఒడ్డున సెల్ఫీకి డాక్టర్ బలి : కృష్ణా జిల్లాలో విషాదం

woman-doctor-krishna-district-drowns-goa-beach

గోవా బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా కెరటాల్లో కొట్టుకుపోయిన వైద్యురాలు రమ్యకృష్ణ  డెడ్ బాడీని కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ఆమె నివాసానికి తీసుకువచ్చారు. జగ్గయ్యపేట మార్కండేయ బజార్‌కు చెందిన రమ్యకృష్ణ .. గోవాలోని ప్రభుత్వ అనుబంధ వైద్య సంస్థలో డాక్టర్ గా పనిచేస్తుంది. జగ్గయ్యపేట ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిణిగా గతంలో పనిచేసిన రమ్యకృష్ణ… 2018లో గోవాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్యురాలిగా చేరింది. మంగళవారం ఆరుగురు స్నేహితులతో కలసి ఆమె గోవా బీచ్‌కు వెళ్లింది.

బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  సముద్రంలో ఒక్కసారిగా వచ్చిన అలలకు రమ్యకృష్ణతోపాటు మరో స్నేహితురాలు కూడా గల్లంతయ్యారు. గమనించిన చుట్టుపక్కల వారు ఆమె స్నేహితురాలిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాగా.. రమ్యకృష్ణ మాత్రం దొరకలేదు. కొద్దిసేపటికి ఆమె మృతదేహం సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. రమ్యకృష్ణ మృతితో జగ్గయ్యపేటలో విషాద చాయలు అలుముకున్నాయి.

Latest Updates