గుళ్లోకి లాక్కెళ్లి మహిళపై అత్యాచారం.. 5 గంటల తర్వాత వదిలేసిన కామాంధులు

దేవడంటే భయం కూడా లేకుండా పోయింది ఆ కామాంధులకు. మహిళను ఏకంగా గుళ్లోకే లాక్కెళ్లి అయిదుగంటల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో జరిగింది. వెలిపాలయంలో ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఆమె కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ఉద్యోగం చేస్తుంది. ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. ఆమెను నాగపట్నానికి చెందిన అరుణ్ రాజ్ (25), ఆనంద్ (24) అనే ఇద్దరు యువకులు తరచుగా వేధిస్తూ ఉండేవాళ్లు. ఆ వేధింపులు భరించలేక ఆమె తన సోదరి ఇంటికి మకాం మార్చింది.

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో మహిళ తన పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. అరుణ్ రాజ్, ఆనంద్‌లు అడ్డగించారు. ఆమెను బలవంతంగా స్థానికంగా ఉన్న గణేష్ ఆలయానికి తీసుకెళ్లి కొట్టారు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశారు. అలా దాదాపు అయిదు గంటలపాటు ఆమెపై దాడి చేశారు. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తన బంగారు నగలన్నీ వారికిచ్చి తనను విడిచిపెట్టాల్సిందిగా మహిళ వారిని వేడుకుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి.. నగలు తీసుకొని అక్కడినుంచి వారిద్దరూ వెళ్లిపోయారు.

అనంతరం స్థానికులు ఆమెను గమనించి.. నాగపట్నం జనరల్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతుంది. ఆస్పత్రి వైద్యుల సమాచారంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకొని.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులపై ఐపీసీ సెక్షన్లు 363, 506 (2), 376 కింద కేసు నమోదు చేసినట్లు వెలిపాలయం పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ త్యాగరాజన్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ పంపామని.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.

For More News..

పోలియో చుక్కల కార్యక్రమం వాయిదా

షాట్స్ ​ఆడేందుకు పుజారా భయపడ్డాడు

‘అమ్మా పోయొస్త.. పిల్లలు పైలం’.. మళ్లీ వలస బాట పట్టిన పాలమూరు కార్మికులు

Latest Updates