చీరలో చిన్నది .. పాముల్ని ఇట్టే పట్టేస్తుంది

పాము అంటే చాలు ప్రాణభయంతో పరుగులు తీస్తారు. కానీ చీరలో ఉన్న ఓ యువతి పాముల్ని సునాయసంగా పట్టేసింది. ప్రస్తుతం ఆ యువతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కర్ణాటకకు చెందిన నిర్జార చిట్టీ అనే యువతి చీరలో ముస్తాబై బంధువుల ఇంట్లో పెళ్లికి వచ్చింది. పెళ్లి జరుగుతుండగా ఓ మహిళ అమ్మో పాము అంటూ కేకలు పెట్టింది. దీంతో నిర్జార సదరు మహిళ ఇంటికి వెళ్లింది. చీరలోనే ఇంట్లో కలుగులో ఉన్న పామును తీసి పట్టుకుంది.

అనంతరం నిర్జార మాట్లాడుతూ తాను స్నేక్ క్యాచర్ గా పనిచేస్తున్నాని, చీరలో పాముల్ని పట్టండం చాలా కష్టమని తెలిపింది. అయితే చీరలో పాముని పట్టడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఎలాంటి సేప్టీ మెథడ్స్ లేకపోయినా పామును చాకిచక్యంగా పట్టుకోవడం మామూలు విషయం కాదని కామెంట్లు చేస్తున్నారు.

Latest Updates