ఆర్టీసీ బస్సు ఢీకొని ఉద్యోగిని మృతి

హైదరాబాద్‌లో ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూసఫ్ గూడ బస్తీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి దీపికారెడ్డి అనే ఉద్యోగిని మృతి చెందింది.  అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసే ఆ యువతి ఉదయాన్నే బైక్ పై ఆఫీస్ కి వెళ్తున్న సమయంలో కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సాయి దీపిక రెడ్డి అక్కడికక్కడే మరణించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ శేఖర్ తెలిపారు

సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.