9వ అంతస్తుపై నుంచి పడినా బతికింది

ఎంత పెద్ద ప్రమాదం జరిగినా.. చిన్నగాయాలతో బతికి బయట పడతారు కొందరు. అది అదృష్టంగా భావిస్తారు. కొందరైతే చిన్న ప్రమాదం జరిగితేనే తీవ్రంగా గాయపడం, చనిపోవడం జరుగుతుంది. ఇందులో మొదటి తరహాకి చెందిన ఘటన రష్యాలో జరిగింది.

సైబీరియా ప్రాంతానికి చెందిన ఓ మహిళ 9వ అంతస్తు నుంచి పడిపోయింది. అయినా ఎలాంటి ప్రమాదానికి గురికాకుండానే .. లేచి నిలబడి తాపీగా నడుచుకుంటూ వెళ్లింది. బిల్డింగ్ పై నుంచి పడిపోయేటప్పుడు .. చెట్లు కానీ.. కరెంటు వైర్లు కానీ .. భవనానికి సంబంధించిన కిటికీల తలుపులు .. ఇలా ఏవీ అడ్డం రాలేదు. దీంతో సరిగ్గా ఆమె నేల మీద పడిపోయింది. పడడం.. పడడం .. మంచు కుప్ప మీద పడింది. అంత ఎత్తు నుంచి కింద పడినా.. చిన్న దెబ్బ కూడా కాలేదు. సరిగ్గా ఒక్క నిముషానికి తాపీగా లేచి నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఇంతకీ ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి కిందకు దూకిందా.. ప్రమాదవశాత్తూ పడిపోయిందా .. అసలు ఏం జరిగిందనే విషయం తెలియడం లేదు. ప్రస్తుతం మహిళను పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.

Latest Updates