వైద్యుల నిర్లక్ష్యం: బస్టాండ్ లో ప్రసవించిన మహిళ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ వెములవాడ బస్టాండ్ ఆవరణలో ప్రసవించింది. రుద్రంగి మండలం గైరిగుట్టకు చెందిన మౌనిక పురిటి నొప్పులు రావడంతో చందుర్తి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి సిబ్బంది చేర్చుకోవడానికి నిరాకరించడంతో బంధువులు ఆమెను సిరిసిల్ల ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు.  అక్కడ వైద్యులు పట్టించుకోక పోవడంతో చేసేదేమి లేక తిరుగు ప్రయాణమైంది మౌనిక. రుద్రంగికి వెళ్తుండగా వేములవాడ బస్టాండ్ ఆవరణలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Latest Updates